mahendran
-
టీఎన్పీఎస్సీ కోచింగ్.. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి..
వేలూరు (తమిళనాడు): బావిలో శవమై తేలిన సంతోష్ ప్రియ(22) కేసును పోలీసులు చేధించారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా కొరటి గ్రామానికి చెందిన సంతోష్ ప్రియ తాతయ్యతో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం టీఎన్పీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత నెల 23వ తేదీన సమీపంలోని బావిలో శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..) పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలియడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా స్విచ్ఛాఫ్‌లో ఉన్న మృతురాలి సెల్‌ఫోన్ సోమవారం తిరుపత్తూరు కోట సమీపంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకుని ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువకుడు కొరియర్ కంపెనీలో పనిచేసే మహేంద్రన్‌గా తెలిసింది. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి అనంతరం బయటకు తెలియకుండా ఉండేందుకు గొంతు నులిమి మృతదేహాన్ని బావిలో వేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
అక్టోబర్ 1న ‘అసలేం జరిగిందంటే..?’
పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసలేం జరిగిందంటే..’. శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా నటించారు. జి.ఎస్.ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా తమ సినిమా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేశారు. కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి దొరబాబు తదితురులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కూర్పు: జె.ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి. -
కమల్‌కు గుడ్ బై.. డీఎంకేలో చేరిన మహేంద్రన్
సాక్షి, చెన్నై : మక్కల్ నీది మయ్యం నుంచి బయటకు వచ్చిన మహేంద్రన్ గురువారం డీఎంకేలో చేరారు. మక్కల్ నీది మయ్యం ఆవిర్భావానికి ముందు నుంచి మహేంద్రన్ నటుడు కమల్ వెన్నంటి ఉంటూ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. తొలుత కోయంబత్తూరు లోక్‌సభ ఎన్నికల్లో, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సింగానల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కమల్‌కు దూరమై ఆ పార్టీని వీడారు. పొత్తు విషయంగా కమల్ చేసిన తప్పును ఎత్తి చూపుతూ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో డీఎంకేలో చేరాలని నిర్ణయించుకుని గురువారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ నేతలు టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనేక మంది నేతలు డీఎంకేలో చేరారు. ఆయనకు స్టాలిన్ సభ్యత్వ కార్డును అందజేశారు. -
దేవుడే సమాధానం చెప్పాలి
మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. అనిల్ బొద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ – ‘‘మనిషి జీవితంలో జరగబోయేది ఎవరికీ తెలియదు. దీనికి సమాధానం దేవుడే చెప్పాలి. కాలంతో పాటు పరిగెత్తడం తప్ప ఏమీ చేయలేం. అదే మా చిత్రంలో చెప్పాను. సెన్సార్ నుంచి ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు. ‘‘శ్రీనివాస్ బండారి తెరకెక్కించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మా సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్. ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను ఆదరించారు. ఇప్పుడు హీరోగా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న నాపై అదే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను’’ అన్నారు మహేంద్రన్. కిషోర్ తటవర్తి, కుమనన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: కర్ణ ప్యారసాని. -
అసలేం జరిగింది?
మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. ఏబీఆర్ ప్రొడక్ష¯Œ ్స, జిఎస్ ఫిలిమ్స్ పతాకంపై అనిల్ బొద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ– ‘‘ఒక్క క్షణంలో మన జీవితంలో జరిగే మార్పును తెలిపే కథ ఇది. క్రైౖమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సెన్సార్ పూర్తయింది. ఈ నెల 9న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి, నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో నా పాత్ర ఒకరకంగా చెప్పాలంటే రవితేజగారి పాత్రలా అనిపిస్తుంది’’ అన్నారు మహేంద్రన్. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్. ‘‘ఈ చిత్రంలో సావి అనే మంచి పాత్ర చేశాను’’ అన్నారు కారుణ్య చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: కర్ణ ప్యారసాని. -
ఏం జరిగిందంటే?
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో జి.ఎస్. ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తమిళ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్‌తో వైవిధ్యమైన పాత్రల్లో బాలనటుడిగా నవ్వులు పండించిన మహేంద్రన్‌ని నా చేతుల మీదుగా హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. వైవిధ్యమైన ప్రేమ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్‌గా చేసిన విజయ్ కుమార్‌గారు ముఖ్య పాత్ర పోషించారు. చరణ్ అర్జున్ అందించిన పాటలు, కర్ణ అందమైన విజువల్స్ హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మల్లేశం.వి, సుజాత.ఎం, రాజేష్.బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సోల్మన్. -
దర్శకుడు మహేంద్రన్ కన్నుమూత
కోలీవుడ్ సినీదర్శక దిగ్గజాల్లో ఒకరైన జె. మహేంద్రన్ మంగళవారం కన్నుమూశారు. నటుడు కూడా అయిన మహేంద్రన్ గతనెల విడుదలైన తమిళ చిత్రం ‘బూమరాంగ్’లో ఓ పాత్ర చేశారు. అలా కొన్ని చిత్రాల్లో నటించిన మహేంద్రన్ ఆనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 79 ఏళ్లు. నటుడు కమలహాసన్ ప్రోత్సాహంతో దర్శకుడయిన ఈయన రజనీకాంత్‌లోని నటుడిని వెలికి తీసిన దర్శకుడిగా వాసికెక్కారు. తమిⶠసినిమా గర్వించదగ్గ చిత్రాలను రూపొందించిన దర్శకుడు మహేంద్రన్. దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మెచ్చిప దర్శకుడీయన. ఆయన ప్రోత్సాహంతోనే సినీ రంగప్రవేశం చేసిన మహేంద్రన్ స్వగ్రామం శివగంగై జిల్లాలోని ఇళైయాన్గుడి. ఈయన అసలు పేరు జే. అలెగ్జాండర్. 1939 జూలై 25న జోసఫ్ సెల్లయ్య,మనోన్మణి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత ఊరులోనే అభ్యసించిన ఈయన ఉన్నత చదువును మధురైలోని అమెరికన్ కళాశాలలో చదివారు. కారైక్కుడిలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ కళాశాల వార్షికోత్సవ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంజీఆర్ హాజరయ్యారు. ఆ వేదికపై మహేంద్రన్ వాక్చాతుర్యాన్ని, పత్రిభను ఎంజీఆర్ ప్రశంసించారు. ఆ తరువాత న్యాయవాది కోర్స్ చేయడానికి చెన్నై వెళ్లారు మహేంద్రన్. అయితే అది పూర్తి చేయకుండానే ‘ఇళముళక్కమ్’ అనే సినిమా పత్రికలో విమర్శకుడిగా చేరారు. కాగా సినిమాలకు దూరంగా ఉన్న ఎంజీఆర్ మళ్లీ నటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి మహేంద్రన్ వెళ్లారు. అప్పుడు ఎంజీఆర్ ఆయన్ని గమనించి లాయడ్స్ రోడ్డులో గల తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మహేంద్రన్ ఆయన ఇంటికి వెళ్లగా తాను నటించాలని ఆశించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను ఇచ్చి దానికి కథనాన్ని తయారు చేయమని పురమాయించారు. ఆ తర్వాత తన నాటక సంఘం కోసం దాన్ని నాటకంగా తీర్చిదిద్దమని చెప్పడంతో అదీ సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అవి రెండూ జరగలేదు. ఆ తరువాత మహేంద్రన్ ఎంజీఆర్ ద్వారా బాలన్ మూవీస్ సంస్థ అధినేత నిర్మించిన ‘నామ్ మూవర్’చిత్రానికి కథను అందించారు. అందులో జయశంకర్, రవిచంద్రన్, నాగేశ్‌లు నటించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో మహేంద్రన్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ‘శభాష్ తంబి, పణక్కార పిళ్లై, నిరైకుడమ్, తిరుడి, తంగపతకం, ఆడుపులి ఆట్టం వంటి పలు చిత్రాలకు కథ, కథనాలను అందించారు. మహేంద్రన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ముల్లుమ్ మలరుమ్’. రజనీకాంత్, శరత్‌బాబు, పటాఫట్ జయలక్ష్మీ, శోభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. రజనీకాంత్‌ను నటుడిగా కొత్త మలుపు తిప్పిన చిత్రం ‘ముల్లుమ్ మలరుమ్’. ఆ తరువాత ‘ఉదిరిపూక్కళ్, పూట్టాద పూట్టుగళ్, జానీ, నెంజల్తై కిల్లాదే, మెట్టి, నండు, కన్నుక్కు మై ఎళుదు, అళగియ కన్నే, కై కొడుక్కుమ్ కై తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1992లో తెరకెక్కించిన ‘ఊర్ పంజాయత్తు’ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న మహేంద్రన్ ‘కలైజ్ఞర్’ (1999) అనే చిత్రానికి రచయితగా వ్యవహరించారు. మళ్లీ సినిమాలకు దూరమైన ఆయన 2004లో ‘కామరాజ్’ అనే చిత్రంలో నటుడిగా కనిపించారు. 2006లో తీసిన ‘సాసనం’ దర్శకుడిగా మహేంద్రన్‌కి చివరి సినిమా. విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన ‘తేరి’ చిత్రంలో ఓ పాత్ర చేసిన ఆయన రజనీకాంత్ ‘పేటా’లో కూడా నటించారు. ‘కాటమరాయుడు’ చిత్రంలోనూ నటించారు మహేంద్రన్. ఆయన తనయుడు జాన్ మహేంద్రన్ తెలుగు చిత్రం ‘ప్రేమించేది ఎందుకమ్మా’కి దర్శకత్వం వహించడంతో పాటు దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్‌తో ‘నీతో’ చిత్రం తెరకెక్కించారు. మహేంద్రన్ మరణంతో తమిళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మహేంద్రన్ భౌతికకాయాన్ని సందర్శించి రజనీకాంత్ కన్నీటి పర్యంతమయ్యారు. రజనీకాంత్‌తో ‘ముళ్లుమ్ మలరుమ్’ తర్వాత కాళీ, జానీ, కై కొడుక్కుమ్ కై వంటి సినిమాలు తీశారు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, కె.భాగ్యరాజా, సంగీతదర్శకుడు ఇళయరాజా, డీఎంకే నేత స్టాలిన్ తదితర సినీ, రాజకీయ రంగ ప్రముఖులు మహేంద్రన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. – బి.నాగేశ్వరరావు, సాక్షి, చెన్నై -
లెజెండరీ డైరెక్టర్ ఇకలేరు
సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు జె. మహేంద్రన్(79) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు. మహేంద్రన్ తమిళంలో అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. శంకర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ముల్లుమ్ మలరుమ్, జానీ, నెంజతై కిల్లాడే చిత్రాలు మహేంద్రన్‌కి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. రజనీకాంత్‌కు ఎక్కువ గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఈయన ఒకరు. నటుడిగాను పలు చిత్రాలలో నటించిన ఆయన ఇటీవలే విజయ్ సేతుపతి సీతాకాతి, రజనీకాంత్ పేటా , బ్యూమ్రాంగ్ వంటి చిత్రాలలో కనిపించారు. 2018లో ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. 80 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్ రెండు సార్లు జాతీయ అవర్డును అందుకున్నారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌కి గురయింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇప్పుడు కో–స్టార్‌గా...
రజనీకాంత్ ‘పేట్టా’లోని తారాగణం రోజు రోజుకీ భారీగా మారుతోంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహాలు ఎంటరయ్యారు. తాజాగా ఈ టీమ్‌లోకి తమిళ దర్శకుడు మహేంద్రన్ కూడా జాయిన్ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పేట్టా’. రజనీకాంత్‌తో ‘ముల్లుమ్ మలరుమ్, జానీ’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నారు. పదేళ్లుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న మహేంద్రన్ విజయ్ ‘తేరీ’తో నటుడిగా ఇండస్ట్రీకు కమ్ బ్యాక్ ఇచ్చారు. అంతకుముందు ఆయన దర్శకుడిగా మాత్రమే చేసేవారు. కమ్‌బ్యాక్‌లో ఒకప్పుడు తాను సూపర్ హిట్ సినిమాలు తీసిన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మహేంద్రన్‌కి ఓ కొత్త ఎక్స్పీరియన్స్. ప్రస్త్రుతం వారణాసీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
హీరోగా బాలనటుడు మహేంద్రన్
బాలనటుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్న మహేంద్రన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. దేవీ, ఆహా, పెదరాయుడు.. చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులకు చేరువైన మహేంద్రన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మహేంద్రన్ తెలుగు, తమిళంలో 50కిపైగా చిత్రాల్లో బాలనటుడిగా కన్పించారు. మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మహేంద్రన్ తెలిపారు. దేవీ చిత్రంలో పోషించిన విలన్ పాత్రకు మహేంద్రన్ మంచి మార్కులు కొట్టేశారు. ఉత్తమ బాలనటుడిగా రెండుసార్లు నంది అవార్డు అందుకున్న మహేంద్రన్.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు. గత కొంతకాలంగా మహేంద్రగా డ్యాన్స్‌కు సంబంధించిన శిక్షణ తీసుకున్నట్టుగా సమాచారం. బాల్యంలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న మహేంద్రన్.. హీరోగా ఏమేరకు అలరిస్తాడో చూడాలి. గతంలో పలువురు బాలనటులుగా మెప్పించి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
సీనియర్ దర్శకుడు మహేంద్రన్‌కు అస్వస్థత
సాక్షి, చెన్నై: సీనియర్ దర్శకుడు మహేంద్రన్ అస్వస్థతకు గురయారు. ఆయన్ని వైద్య చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఉరుదిపూక్కల్, ముల్లుం మలరుం వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మహేంద్రన్. రజనీకాంత్, కమలహాసన్‌లతో పలు చిత్రాలను చేసిన మహేంద్రన్ ఈ మధ్య నటుడు విజయ్ నటించిన తెరి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా పాత్రను రక్తిగట్టించిన మహేంద్రన్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన నిమిర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. ఈ నెల 26న మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో మహేంద్రన్ అకస్మాత్తు ఆనారోగ్యానికి గురికావడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
ఆ ఇద్దరితో ఊరు ఖాళీ
తమిళసినిమా: గ్రామాల్లో ఎవరైనా తప్పు జేస్తే వారిని గ్రామ ప్రజలు వెలి వేస్తారు. కుల మతాల కారణంగా ప్రేమ జంటలు ఒక్కోసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అయితే ఒక ప్రేమజంట కారణంగా ఆ గ్రామ ప్రజలే ఊరు వదిలి వెళ్లిపోయిన ఇతివృత్తంతో రూపొందిన చిత్రం నాడోడి కనవు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. వీరసెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేంద్రన్ కథానాయకుడిగా నటించారు.ఈయన బాల నటుడిగా దక్షిణాది భాషలన్నింటిలోనూ అనేక చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. నాయకిగా సుప్రజ నటించిన ఇందులో క్రేన్‌మనోహర్, విజయ్గణేశ్, కే.రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. సబేష్ మురళి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. అసలు ఒక ప్రేమజంట కారణంగా గ్రామ ప్రజలే ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది లాంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం నాడోడి కనవు అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను శివగంగై, చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, చిత్రాన్ని ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైందని..
అన్నానగర్: తనను ప్రేమించిన అమ్మాయి మరోకరిని వివాహాం చేసుకోవటానికి సిద్ధమైందని తెలిసి సహించలేక ప్రేయసిని హత్య చేసిన సంఘటన పెన్నాగరం సమీపంలో కలకలం రేపింది. వివరాలోకి వెళ్లితే.. సెల్రంపట్టికి చెందిన తంగరాజ్ కుమార్తె తమిళా(18) ఈమె ప్లస్ 2 ముగించుకుని కళాశాలలో చేరటానికి ఆప్లికేషన్ వేసింది. బుధవారం రోజు ఓ బండ మీద తమిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన కుమార్తె చావుపై అనుమానం ఉందని తండ్రి పెన్నాగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన యువకుడు మహేంద్రన్(24) ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతలో గురువారం విచారణ చేశారు. విచారణలో మహేంద్రన్.. నేను తమిళా ఇద్దరం ప్రేమించుకుంటూ వచ్చాం. ప్రేమించిన నన్ను కాదని మరోకరికి ఇచ్చి వివాహం చేయించాలని తల్లిదండ్రులు సిద్ధం కాగానే ఆమె ఒప్పుకున్నట్లుగా తెలిసింది. దీంతో తమిళాకి ఫోన్ చేసి ఊరు బయటకి పిలిపించాను. అప్పుడే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యావా అని అడిగినప్పపుడు మా మధ్య తగదా ఏర్పడందని చెప్పాడు. ఇంతలో ఆవేశం చెందిన నేను తమిళా చేతులను కట్టివేసి హత్య చేయటానికి ప్రయత్నించాను. ఇంతలో ఆమె సృహా తప్పి కింద పడటం వల్ల గొంతు నులిమి హత్య చేశాను. తరువాత అనుమానం రాకూడని ఆమె నోటిలో విషం పోసి వెళ్లిపోయనని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. యువతి హత్య కేసులో మహేంద్రన్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు చేసి సేలం సెంట్రల్ జైలుకు పంపించారు. -
సెన్సార్‌కు భయపడకూడదు
తమిళసినిమా: చిత్ర నిర్మాతలు సెన్సార్ బోర్డుకు భయపడకూడదని సీనియర్ నటుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు ఎస్వీ.శేఖర్ వ్యాఖ్యానించారు. కే 3 క్రియేషన్స పతాకంపై ప్రతాప్ మురళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం తిట్టివాసల్. ప్రముఖ నటుడు నాజర్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో మహేంద్రన్, తనూశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియో, ట్రైలర్లను నటుడు, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ ఆవిష్కరించగా తొలి ప్రతులను ఎస్వీ.శేఖర్, యూటీవీ ధనుంజయన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ ఖర్చు చేసే ప్రతి రూపాయి చిత్రంలో తెలియాలన్నారు. అది ఈ చిత్రంలో స్పష్టంగా తెలుస్తోందని అందుకు చిత్ర నిర్మాతను అభినందిస్తున్నానని అన్నారు.అయితే ఒక సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఒక సూచన చేయాలనుకుంటున్నానన్నారు. దయ చేసి చిత్ర విడుదల తేదీని నిర్ణయించి సెన్సార్‌కు వెళ్లకండని అన్నారు. అలా వెళితే తగిన సమయం లేకపోవడంతో సెన్సార్ వారు షరతులకు తలవంచాల్సి వస్తుందన్నారు. నిర్మాతలకు ధైర్యం చాలా అవసరం అన్నారు.చిత్రాలు మీవని, మీరు చట్టబద్ధంగానే చిత్రాలు చేస్తున్నారని, అందువల్ల సెన్సార్ వారి చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. విడుదలకు సమయం ఉంటే సెన్సార్ వారి నిబంధనలకు తలవంచాల్సిన అవసరం మీకుండదని ఎస్వీ.శేఖర్ అన్నారు. -
మహేంద్రన్ నామినేషన్ దాఖలు
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలు ఎన్నికల్ని బహిష్కరించాయి. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి , అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఢీ కొట్టేందుకు సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ రేసులో నిలబడ్డారు. నామినేషన్ దాఖలు కన్నా ముందుగా, తన ఓట్ల వేటకు మహేంద్రన్ శ్రీకారం చుట్టి, ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, ఆయనకు మద్దతుగా సీపీఐ, సీపీఎం నాయకులు రంగంలోకి దిగారు. నామినేషన్ దాఖలు : సోమవారం నాటికి అన్నాడీఎంకే అభ్యర్థి జయలలితతో పాటుగా 27 మంది తమ నామినేషన్లను సమర్పించారు. ఇందులో కొన్ని చిన్నా చితకా పార్టీల నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తండయార్ పేటలోని ఎన్నికల అధికారి కార్యాలయానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌తో కలసి అభ్యర్థి మహేంద్రన్ వచ్చారు. తన నామినేషన్, ప్రమాణ పత్రాన్ని అందజేశారు. అంతకు ముందుగా స్వతంత్ర అభ్యర్థులు పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటితో కలుపుకుంటే, ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం బరిలో నిలబడ్డ వారి సంఖ్య 38కి చేరిం ది. ఇక నామినేషన్ల పర్వం బుధవారం సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు స్వతంత్ర అభ్యర్థుల పేరిట నాలుగైదు నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. గురువారం నామినేషన్ల పరిశీలన పర్వం జరగనున్నది. ఇందులో ఎన్ని నామినేషన్లు తిరస్కరణకు గురి అవుతాయో వేచి చూడాల్సిందే. ప్రచార హోరు : ఈ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా చిన్నా , చితక పార్టీల నాయకులు ఉన్నా, ప్రధానంగా పోటీ అన్నది అన్నాడీఎంకే, సీపీఐ మధ్య నెలకొని ఉంది. ఆ నియోజకవర్గంలో కార్మిక ఓటు బ్యాంక్ అధికమే. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గెలుపు సునాయాసమైనా, ఆమె మెజారిటీ తగ్గించే దిశగా ప్రయత్నాలు వేగవంతం అయ్యాయని చెప్పవచ్చు. తమకు బలం ఉందని చాటుకునే విధంగా సీపీఐ అభ్యర్థి సుడిగాలి ప్రచారం సాగిస్తుండడం విశేషం. నామినేషన్ దాఖలు అనంతరం తండయార్ పేట నెహ్రూ నగర్‌కు చేరుకున్న మహేంద్రన్ అక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సీపీఎం రాజ్య సభ సభ్యుడు రంగరాజన్ ప్రారంభించారు. అనంతరం మహేంద్రన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇక, నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరడంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్నాడీఎంకే అభ్యర్థి,సీఎం జయలలిత తరుపున మంత్రులు వలర్మతి, వైద్యలింగం, పళనియప్పన్, సెల్లూరు కే రాజు వేర్వేరుగా ఆ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్ల సేకరణలో నిమగ్నం అయ్యారు. -
వేడెక్కిన ఉప సమరం
ఆర్కే నగర్ ఉప సమరం వేడెక్కింది. సీపీఐ అభ్యర్థిగా రేసులో నిలబడ్డ మహేంద్రన్ శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈనెల తొమ్మిదిన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఇక, ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సందీప్ సక్సేనా దృష్టి పెట్టారు. ఈ సారి ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు సైతం పొందుపరచబోతున్నారు. సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామితో పాటుగా పధ్నాలుగు మంది ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేశారు. సీఎం, అన్నాడీఎంకే అభ్యర్థి జయలలిత శుక్రవారం తన నామినేషన్‌ను ఎన్నికల అధికారికి సమర్పించారు. జయలలిత నామినేషన్ దాఖలుతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. తమ అమ్మ జయలలితను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే వర్గాలు ఇంటింటా సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యాయి. శనివారం ఉదయాన్నే తమ ప్రచారాన్ని చేపట్టినా, పార్టీ నాయకురాలు సులోచన సంపత్ మృతితో రద్దు చేసుకున్నారు. ఇక, జయలలితను ఢీకొట్టేందుకు సీపీఐ రేసులో నిలబడింది. ఆ పార్టీ అభ్యర్థిగా మహేంద్రన్ పోటీకి సిద్ధం అయ్యారు. ప్రచారంలో మహేంద్రన్: తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన మహేంద్రన్ సీపీఐ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 40 ఏళ్లుగా సీపీఐకు ఆయన సేవలు అందిస్తూ రాగా, ప్రస్తుతం తొలి సారిగా ఎన్నికల బరిలో నిలబడే అవకాశం వచ్చింది. సీఎం జయలలితకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైన మహేంద్రన్ తన ప్రచారాన్ని చేపట్టారు. ఉదయాన్నే తండయార్ పేట పరిసరాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించినానంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటా తిరుగుతూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈసందర్భంగా మహేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, ఆర్కే నగర్లో అన్నాడీఎంకే వరుసగా గెలుపొంది ఉందని గుర్తు చేస్తూ, వారి ద్వారా ఇక్కడి ప్రజలకు ఒరిగింది శూన్యమేనని శివాలెత్తారు. పేదలు, కార్మికులు అత్యధికంగా నివాసం ఉన్న నియోజకవర్గం ఇది అని, అభివృద్ధి పరంగా ఈ ప్రాంతం వెనుకబడి ఉందని వివరించారు. అన్నాడీఎంకే సర్కారు ఈ నియోజకవర్గంపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని, ఆ ప్రభుత్వ అవినీతి , అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తన ప్రచారం సాగుతుందన్నారు. ఇక, ఆర్కే నగర్ బరిలో తామూ అంటూ కొన్ని చిన్నా, చితక పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో తమిళ మానిల కట్చి నేత, న్యాయవాది పాల్ కనకరాజ్, తమిళ మానిల ద్రావిడ మున్నేట్ర కళగం నేత యూకే మణియన్ కూడా ఉన్నారు. డీఎండీకే, బీజేపీ మళ్లీ చర్చ : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై బీజేపీ, డీఎండీకేలు ఇంత వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించ లేదు. ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు బరిలో దిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ మారు డిఎండికే నేత విజయకాంత్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ భేటీ అయ్యారు. అయితే, విజయాకాంత్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించ లేదు. నామినేషన్ల గడువు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల్లో పోటీ చేద్దామా..? వద్దా..? అన్న నిర్ణయం తీసుకునేందుకు విజయకాంత్ ఇంటి మెట్లను మరో మారు తమిళి సై ఎక్కాల్సి వచ్చింది. ఉదయం పదకొండున్నర గంటలకు విజయకాంత్ ఇంటికి వెళ్లిన ఆమె అర గంట పాటుగా భేటీ అయ్యారు. పోటీ విషయంగా ఆదివారం తమ నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ, డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవీఎంలలో ఫోటోలు : ఆర్కే నగర్లో ఉపయోగించే ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలను పొందు పరచబోతున్నారు. ఒకే పేర్లతో పలువురు ఎన్నికల బరిలో నిలబడుట పరిపాటే. ఇది కాస్త ఓటర్లను గందరగోళానికి గురి చేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించే రీతిలో ఉప ఎన్నికలో అభ్యర్థి ఫోటోను పొందు పరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అభ్యర్థి పేరు, వరుస నెంబరు, చిహ్నంతో పాటుగా ఫోటోను పొందు పరిచే కసరత్తులు ఆరంభం అయ్యాయి. నామినేషన్ల సమయంలోనే మూడు నెలల్లోపు తీసుకున్న ఫోటోలను అభ్యర్థుల నుంచి స్వీకరిస్తున్నట్టు, ఆ ఫోటోలే ఈవీఎంలలో ప్రత్యక్షం కాబోతున్నట్టుగా ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నాయి. -
అదనంగా ఇస్తేనే..
నటీమణుల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించే వారు కొందరైతే, అవకాశం వచ్చినప్పుడే సాధ్యమైనంత వరకు డబ్బు గుంజుకోవాలనే హీరోయిన్లు మరికొందరుంటారన్నది వాస్తవం. ఇక్కడ రెండో కోవకు చెందిన నటి శ్వేత అంటున్నారు. ఎండ్రుమ్ ఆనందం చిత్ర దర్శక నిర్మాతలు నార్కాలి పిక్చర్స్ పతాకంపై మహిళా నిర్మాత విమల రాజనాయకం నిర్మిస్తున్న చిత్రం ఎండ్రుమ్ ఆనందం. వివేక్ భారతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా వర్తమాన తార శ్వేత నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాల్గొనకపోవడానికి కారణాన్ని దర్శక నిర్మాతలు తెలుపుతూ ఆమెకు నిర్ణయించిన పారితోషికం చెల్లించినా అదనంగా డబ్బు ఇస్తేనే ఆడియో ఆవిష్కరణకు వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని హీరోయిన్లపై తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటున్నా శ్వేత లాంటి హీరోయిన్లు ఇంకా ఉండటం గమనార్హం.