![Child Artist Mahendran Turns As Hero - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/2/mahendran.jpg.webp?itok=gimeUtTV)
బాలనటుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్న మహేంద్రన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. దేవీ, ఆహా, పెదరాయుడు.. చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులకు చేరువైన మహేంద్రన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మహేంద్రన్ తెలుగు, తమిళంలో 50కిపైగా చిత్రాల్లో బాలనటుడిగా కన్పించారు. మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మహేంద్రన్ తెలిపారు.
దేవీ చిత్రంలో పోషించిన విలన్ పాత్రకు మహేంద్రన్ మంచి మార్కులు కొట్టేశారు. ఉత్తమ బాలనటుడిగా రెండుసార్లు నంది అవార్డు అందుకున్న మహేంద్రన్.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు. గత కొంతకాలంగా మహేంద్రగా డ్యాన్స్‌కు సంబంధించిన శిక్షణ తీసుకున్నట్టుగా సమాచారం. బాల్యంలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న మహేంద్రన్.. హీరోగా ఏమేరకు అలరిస్తాడో చూడాలి. గతంలో పలువురు బాలనటులుగా మెప్పించి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment