![Vijay Sethupathi launches Asalu Em Jarigindhante first look - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/12/asalem-jarigindhi.jpg.webp?itok=MI-l69YD)
మహేంద్రన్
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో జి.ఎస్. ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తమిళ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్‌తో వైవిధ్యమైన పాత్రల్లో బాలనటుడిగా నవ్వులు పండించిన మహేంద్రన్‌ని నా చేతుల మీదుగా హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. వైవిధ్యమైన ప్రేమ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్‌గా చేసిన విజయ్ కుమార్‌గారు ముఖ్య పాత్ర పోషించారు. చరణ్ అర్జున్ అందించిన పాటలు, కర్ణ అందమైన విజువల్స్ హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మల్లేశం.వి, సుజాత.ఎం, రాజేష్.బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సోల్మన్.
Comments
Please login to add a commentAdd a comment