ఇంకోటి! | vijay sethupathi kadaisi vivasayi first look release | Sakshi
Sakshi News home page

ఇంకోటి!

Published Sat, Jul 6 2019 12:17 AM | Last Updated on Sat, Jul 6 2019 12:17 AM

vijay sethupathi kadaisi vivasayi first look release - Sakshi

విజయ్‌ సేతుపతి

ఈ ఏడాది తమిళ నటుడు విజయ్‌ సేతుపతికి విభిన్నంగా సాగుతోంది. హీరోగా, విలన్‌గా, ట్రాన్స్‌జెండర్‌గా రకరకాల పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న సినిమాలు కూడా అలానే ఉంటాయని అర్థం అవుతోంది. దానికి కారణం ఆ సినిమాల్లో సేతుపతి గెటప్సే. తాజాగా ‘కడైసి వివసాయి’ అనే సినిమాలో మానసికంగా ఆరోగ్యవంతంగా లేని పాత్రలో కనిపిస్తారట. మణికందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు విజయ్‌ సేతుపతి. ఇందులో అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘కడైసి వివసాయి’ ఆగస్ట్‌లో రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement