![Asalu Yem Jarigindante Trailer Launch - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/14/asalem-jarigindhi.jpg.webp?itok=OQ7zUATB)
శ్రీనివాస్, మహేంద్రన్
మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. అనిల్ బొద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ – ‘‘మనిషి జీవితంలో జరగబోయేది ఎవరికీ తెలియదు. దీనికి సమాధానం దేవుడే చెప్పాలి. కాలంతో పాటు పరిగెత్తడం తప్ప ఏమీ చేయలేం. అదే మా చిత్రంలో చెప్పాను. సెన్సార్ నుంచి ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు.
‘‘శ్రీనివాస్ బండారి తెరకెక్కించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మా సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్. ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను ఆదరించారు. ఇప్పుడు హీరోగా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న నాపై అదే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను’’ అన్నారు మహేంద్రన్. కిషోర్ తటవర్తి, కుమనన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: కర్ణ ప్యారసాని.
Comments
Please login to add a commentAdd a comment