karunya Chaudhary
-
నా నీ ప్రేమకథ సినిమా రివ్యూ
రివ్యూ : ‘నా నీ ప్రేమ కథ’ తారాగణం : అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి, రమ్య శ్రీ, అజయ్ ఘోష్, షఫీ, ఫిష్ వెంకట్, అన్నపూర్ణమ్మ తదితరులు రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్ కెమెరా : ఎంఎస్ కిరణ్ కుమార్ సంగీతం : ఎమ్ ఎల్ పి రాజా ఎడిటర్ : నందమూరి హరి నిర్మాణం: పిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: పోత్నాక్ శ్రవణ్ కుమార్ కథ నాని (అముద శ్రీనివాస్) చిన్న గ్రామంలో పేపర్‌బాయ్‌గా పని చేస్తాడు. అజయ్ ఘోష్ గ్రామ పెద్ద. ఆయన కూతురు నందిని (కారుణ్య) హైదరాబాద్‌లో డాక్టర్ చదివి, స్వగ్రామంలో ఆసుపత్రిని నిర్మించి గ్రామ ప్రజలకు సేవ చేయాలని సొంతూరుకి తిరిగొస్తుంది. నాని నందినిని ప్రేమిస్తాడు. గుణ(షఫీ) కూడా నందినిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకుని నందిని తండ్రి నాయుడు (అజయ్ ఘోష్) నానిని చంపాలనుకుంటాడు. అదే అమ్మాయిని ప్రేమిస్తున్న గుణ (షఫి) నాని రక్షిస్తాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని రక్షించడం.. తనలో వచ్చిన మార్పా? లేక నమ్మించి గొంతు కోసేందుకు ప్లాన్ చేశాడా? తర్వాత ఏం జరిగింది? చివరికి నాని, నందిని పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ. విశ్లేషణ ఇది ముగ్గురి మధ్య సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నానిని రక్షించిన సమయంలో గుణలో వచ్చిన మార్పు, దాని వెనకున్న సస్పెన్స్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడు. అయితే ఇక్కడ దర్శకుడే హీరో కావడం సినిమాకు కొంత మైనస్‌గా మారింది. అటు హీరో పని, ఇటు దర్శకుడి బాధ్యత రెండూ తన భుజాన వేసుకోవడంతో అక్కడక్కడా పట్టు తప్పిపోయాడు. రెండింటిని సక్రమంగా నిర్వర్తించాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో అక్కడక్కడా డైరెక్షన్ మీద పట్టు తప్పినట్లు అనిపిస్తుంది. హీరో పాత్రలో బాగానే నటించాడు, కానీ హీరో స్థానంలో మరొకరిని తీసుకుని ఉండుంటే అతని మీద ఒత్తిడి తగ్గి అవుట్‌పుట్ ఇంకాస్త మెరుగ్గా వచ్చేది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి పర్వాలేదనిపించారు. సిటీలో డాక్టర్ చదివి వచ్చినప్పటికీ గ్రామీణ మూలాలు మరచిపోకుండా సాంప్రాదాయంగా కనిపించడంలో కారుణ్య వంద శాతం సక్సెస్ అయింది. షఫీ గుణ పాత్రలో చక్కగా సెట్టయ్యాడు. అజయ్‌ఘోష్ తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... దర్శకుడు ప్రేమ, భావోద్వేగపు సన్నివేశాలను అద్భుతంగా మలచాలని ప్రయత్నించాడు, కానీ కొంతమేరకే సఫలీకృతమయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. కెమెరా పనితీరు బానే ఉంది. కానీ, సినిమాలో అక్కడక్కడా దృశ్యాలు డల్‌గా అనిపించాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించదు. రొటీన్ ప్రేమకథే కావడంతో చాలా సన్నివేశాలను ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేస్తాడు. చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ -
వాస్తవంగా జరిగిన కథే.. నా నీ ప్రేమ కథ
ఆముద శ్రీనివాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నా.. నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి హీరోయిన్గా నటించారు. పోత్నాక్ శ్రవణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో ఆముద శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. పేపర్‌బాయ్, డాక్టర్ల ప్రేమకథ ఈ చిత్రం. ప్రేమ ఎలా అయినా పుట్టొచ్చు అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘చాలా మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు పోత్నాక్ శ్రవణ్‌కుమార్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, శోభారాణి మాట్లాడారు. -
సినిమా టీజర్ విడుదల చేసిన మంత్రి
అముద శ్రీనివాస్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘టీజర్ అద్భుతంగా ఉంది. హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ చక్కని ప్రతిభ కనబరిచారు. టీజర్‌ని చూస్తుంటే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంతో ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్‌కి మంచి లాభాలు రావాలి. అలాగే హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్‌కి మంచి అవకాశాలు రావాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్‌పి రాజా, కెమెరా: ఎంఎస్ కిరణ్ కుమార్. -
దేవుడే సమాధానం చెప్పాలి
మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. అనిల్ బొద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ – ‘‘మనిషి జీవితంలో జరగబోయేది ఎవరికీ తెలియదు. దీనికి సమాధానం దేవుడే చెప్పాలి. కాలంతో పాటు పరిగెత్తడం తప్ప ఏమీ చేయలేం. అదే మా చిత్రంలో చెప్పాను. సెన్సార్ నుంచి ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు. ‘‘శ్రీనివాస్ బండారి తెరకెక్కించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మా సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్. ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను ఆదరించారు. ఇప్పుడు హీరోగా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న నాపై అదే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను’’ అన్నారు మహేంద్రన్. కిషోర్ తటవర్తి, కుమనన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: కర్ణ ప్యారసాని. -
అసలేం జరిగింది?
మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. ఏబీఆర్ ప్రొడక్ష¯Œ ్స, జిఎస్ ఫిలిమ్స్ పతాకంపై అనిల్ బొద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ– ‘‘ఒక్క క్షణంలో మన జీవితంలో జరిగే మార్పును తెలిపే కథ ఇది. క్రైౖమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సెన్సార్ పూర్తయింది. ఈ నెల 9న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి, నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో నా పాత్ర ఒకరకంగా చెప్పాలంటే రవితేజగారి పాత్రలా అనిపిస్తుంది’’ అన్నారు మహేంద్రన్. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్. ‘‘ఈ చిత్రంలో సావి అనే మంచి పాత్ర చేశాను’’ అన్నారు కారుణ్య చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: కర్ణ ప్యారసాని. -
ఇండస్ట్రీలోని త్రీ మంకీస్ మేమే
‘‘ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద వాళ్లున్నా నన్ను, మంచు లక్ష్మి, అలీని ఎందుకు పిలిచారు? మేం ముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని, ఇండస్ట్రీలో ఉన్న త్రీ మంకీస్ మేమే అని మమ్మల్ని పిలిచినట్టున్నారు’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. కారుణ్య చౌదరి హీరోయి¯Œ గా నటించారు. అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి నిర్మించిన ఈ సినిమా రేపువిడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు’ లాంటి టైటిల్స్ ఏ హీరోకి పెట్టినా సరిపోతాయి. ‘3 మంకీస్’ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్’ లో చేయడమే కష్టం’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీతో పాటు చిన్న దర్శకులు బాగుంటారు’’అన్నారు నటుడు అలీ. ‘‘మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు నగేష్. ‘‘ఇలాంటి పాత్ర చేస్తానని జీవితంలో అనుకోలేదు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘మా ముగ్గురికీ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ ప్రపంచంలో సాయం అనే మందు లేక చాలా మంది చనిపోతున్నారని మా చిత్రంలో చెప్పాం’’ అన్నారు అనిల్. హీరో ఆకాష్ పూరి, కారుణ్య చౌదరి, రచయిత అరుణ్, కెమెరామేన్ సన్నీ మాట్లాడారు. -
త్రీ మంకీస్ పైసా వసూల్ చిత్రం
‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ – ‘‘కామెడీతో పాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్ చిత్రమిది’’ అన్నారు. ‘‘త్రీ మంకీస్’ చిత్రం మా బ్యానర్‌కి మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అన్నారు నగేష్. ‘‘మేం ముగ్గురం కలసి సరదాగా నటించాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు గెటప్ శ్రీను. ‘‘సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాంప్రసాద్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి. -
నవ్వించి ఏడిపిస్తాం
‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్‌లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి. ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్’. కారుణ్య చౌదరి కథానాయిక. ఓరుగుల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ జి. దర్శకత్వంలో నగేశ్ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్‌ను శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్ చూస్తాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్. 90 రకాల గెటప్‌లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్‌తో అతను అలరిస్తాడు’’ అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ అన్నారు. ‘‘ఫస్టాఫ్‌లో నవ్విస్తాం, సెకండాఫ్‌లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్ కుమార్. ‘‘స్క్రిప్ట్ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్. -
వినోదాల ఎర్రచీర
శ్రీకాంత్ కీలక పాత్రలో, అలీ, బేబీ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు, కమల్ కామరాజు, అజయ్, శ్రీరాం ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్యసుమన్ బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలవుతోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యసుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్, సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. చేజింగ్ సీన్స్, హారర్, కామెడీ హైలైట్. షూటింగ్ ముగింపు దశలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఈ నెల చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రియాంక అగస్టీన్–రఘుబాబు– ఫిష్ వెంకట్ల ప్రత్యేక గీతం మా సినిమాలో మరో హైలైట్’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిల్ల. -
ఎర్రచీర సస్పెన్స్
శ్రీకాంత్ కీలక పాత్రలో బేబి సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్య సుమన్‌బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. సత్యసుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్ సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోయిన్ ప్రియాంక అగస్టీన్–రఘుబాబు– ఫిష్ వెంకట్‌లపై ప్రత్యేక పాట చిత్రీకరిస్తున్నాం. ఇందులో చేజింగ్ సీన్స్, హారర్, కామెడీ హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలో క్లయిమాక్స్ చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీకాంత్, కమల్ కామరాజు, అజయ్, శ్రీరాం, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘ఆగస్టు చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేసి, సెప్టెంబర్ 20న సినిమా విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చందు. -
చిన్న సినిమాలు హిట్ అవ్వాలి
‘‘ఎర్రచీర’ సినిమా పోస్టర్ చూస్తుంటే సాయితేజస్విని లుక్ పవర్‌ఫుల్‌గా ఉందనిపిస్తోంది. ఇలాంటి ఫీలింగ్ కొన్ని సినిమాలకే కలుగుతుంది. చిన్న సినిమాలు మంచి విజయాలు సాధించాలి. అప్పుడే మాలాంటివాళ్లకు అవకాశాలు వస్తాయి’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘మహానటి’ ఫేం బేబి సాయి తేజస్విని, కారుణ ్య చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్‌లో హారర్ కోణం కనిపిస్తోంది. సాయి తేజస్విని చిన్నదైనా చక్కగా నటించింది. ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తనతో ఓ పాత్ర చేయించాలనుకున్నా. కానీ, వయసు తక్కువని మిస్సయ్యాను.. ఇప్పుడు ఫీలవుతున్నా. రాజేంద్రప్రసాద్‌గారిని డాడీ అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు’’ అన్నారు. ‘‘పోస్టర్ చూసి మా సినిమా హారర్ థ్రిల్లర్ అనుకుంటున్నారు. కానీ, ఇది ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ ఉన్న కథ. హారర్‌ని టచ్ చేశామంతే. సినిమా బాగా వస్తోంది. విజయంపై ధీమాగా ఉన్నాం’’ అని సుమన్‌బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు కమల్ కామరాజు, సంగీత దర్శకుడు ప్రమోద్ పులిగిల్ల, డైలాగ్ రైటర్ గోపి విమలపుత్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్, నటి గీతాసింగ్ పాల్గొన్నారు. -
గ్రామీణ నేపథ్యంలో...
సుమన్‌బాబు, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి, ‘మహానటి’ ఫేం బేబీ సాయి తుషిత ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్ర చీర’. సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రంలో ‘ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ శ్రీరామ్ ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు. సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్. మొదటి షెడ్యూల్లో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌ను తీశాం. ఈ నెల 15న ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్లో వినోదం, పోరాట సన్నివేశాలు తీస్తాం. శ్రీరామ్పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిళ్ళ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్. -
జర్నలిస్ట్ ఏం చేశాడు?
‘‘అమెరికా నుంచి ఏడాది తర్వాత తిరిగి వచ్చాక విన్న కథల్లో ‘దాడి’ నచ్చింది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి పాత్రలో కనిపిస్తా. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాల వెనక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశానన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా తర్వాత చంద్రమహేశ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి ముఖ్య తారలుగా వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్ ఆరా, జయరాజు.టి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. మధు శోభ.టి మాట్లాడుతూ– ‘‘యూత్‌కు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది’’ అన్నారు. ‘‘మధు చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’’ అని శంకర్ ఆరా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్ ఈదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్. -
'సీత రాముని కోసం' మూవీ రివ్యూ
టైటిల్ : సీత రాముని కోసం జానర్ : ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ తారాగణం : శరత్ శ్రీరంగం, అనిల్ గోపిరెడ్డి, కారుణ్య చౌదరి సంగీతం, దర్శకత్వం : అనిల్ గోపిరెడ్డి నిర్మాత : శిల్పా శ్రీరంగం తెలుగు తెర మీద సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ సినిమాల హవా ఇటీవల కాస్త తగ్గింది. అయితే ఇప్పటికీ ఆ జానర్ సినిమాలకు మంచి ఆదరణ లబిస్తున్న నేపథ్యంలో ఈ శుక్రవారం హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సీత రాముని కోసం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ హర్రర్ సినిమాల మాదిరిగా కేవలం భయం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తో తెరకెక్కిన సీత రాముని కోసం ప్రేక్షకులను ఆకట్టుకుందా..? కథ : పారా సైకాలజిస్ట్ అయిన విక్రాంత్ (శరత్ శ్రీరంగం) అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తన అక్కకు పుట్టబోయే బిడ్డ కోసం విక్రాంత్ ఇక్కడ ఓ విల్లా కొంటాడు. అయితే ఆ విల్లాలో ఏదో సమస్య ఉందని తెలియటంతో తానే స్వయంగా సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. పారా సైకాలజిస్ట్ గా ఆత్మల సమస్యలు తెలుసుకోవటంలో అనుభవం ఉన్న విక్రాంత్ తాను కొన్న అంజలి నిలయంలో ఓ చిన్న పాప ఆత్మ ఉందని తెలుసుకుంటాడు. అయితే ఆ పాపతో పాటు మరో ఆత్మ కూడా ఉండి ఉంటుందని విక్రాంత్ అనుమానం. అదే సమయంలో విల్లాలోని ఆత్మ విక్రాంత్ కు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. (సాక్షి రివ్యూస్) విక్రాంత్ కూడా విల్లా తాను కొనటానికి ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి పాత ఓనర్ రామ్ (అనిల్ గోపిరెడ్డి)ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు విల్లాలో ఉన్న ఆ ఆత్మలు ఎవరివీ..? విక్రాంత్ తో ఆ ఆత్మలు ఏం చెప్పాలనుకున్నాయి..? పాత ఓనర్ రామ్ కి ఆ ఆత్మలకు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : రెగ్యులర్ హర్రర్ జానర్ కు భిన్నంగా ఎమోషనల్ కథను ఎంచుకున్న అనిలో గోపిరెడ్డి, అనుకున్నట్టుగా కథను తెర మీదకు తీసుకురావటంలో సక్సెస్ సాధించాడు. ఫస్ట్ హాఫ్ థ్రిల్లర్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను ఎమోషనల్ డ్రామాగా రూపొందించాడు. అయితే కథలో వేగం తగ్గటం కాస్త ఇబ్బంది పెడుతుంది. దర్శకుడిగా పరవాలేదనిపించిన అనిల్ సంగీత దర్శకుడి మంచి విజయం సాదించాడు. ముఖ్యంగా లాలీ లాలీ పాట థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకులను వెంటాడుతుంది. (సాక్షి రివ్యూస్) నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అయితే కీలక పాత్రలో తానే నటించిన అనిల్ నటుడిగా నిరాశపరిచాడు. అనిల్ నటించిన రామ్ పాత్రకు అనుభవం ఉన్న నటుడైతే బాగుండనిపిస్తుంది. హీరోగా శరత్ శ్రీరంగం నటన బాగుంది. శరత్ లుక్, బాడీ లాంగ్వేజ్ విక్రాంత్ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. సీత పాత్రలో కారుణ్య చౌదరి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. ప్లస్ పాయింట్స్ : కథ సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మహేష్‌బాబుకు మరదలిగా నటిస్తున్నా
వర్ధమాన నటి కారుణ్య చౌదరి కొయ్యలగూడెం :కొరటాల శివ దర్శకత్వంతో మహేష్‌బాబు హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో ఆయన్ను ఆట పట్టించే కొంటె మరదలుగా నటిస్తున్నట్లు వర్ధమాన నటి కారుణ్య చౌదరి తెలిపారు. బయ్యనగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలకు ఆమె దర్శకుడు జంగాల నాగబాబుతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బయ్యనగూడెం గ్రామానికి చెందిన నాగబాబు కోరిక మేరకు అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి మరికొందరు నటులు, డెరైక్టర్లు, కో-డెరైక్టర్లతో రెండ్రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కాకినాడకు చెందిన తాను హైదరాబాద్‌లో స్థిరపడినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం తననెంతో ఆకర్షించినట్టు తెలిపారు. ఇంతకు ముందు శ్రీమంతుడు సినిమాలో నటించానని తెలిపారు. దర్శకుడు నాగబాబు మాట్లాడుతూ ప్రస్తుతం తన దర్శకత్వంలో ‘మా ప్రయత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నామని, దీన్లో కారుణ్యచౌదరి హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలిపారు. కోరుమామిడిలో ఈ నెల 15వ తేదీన షూటింగ్ ప్రారంభించామని, పోలవరం, పట్టిసీమ, బందకట్టు, జల్లేరు, మద్ది తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు నటి కారుణ్య బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు కారుణ్య చౌదరిని శాలువాలతో సత్కరించి మెమెంటోను అందజేశారు. కో-డెరైక్టర్ సోమ సాయిరామకృష్ణ, అసోసియేట్ డెరైక్టర్ కరుటూరి బుల్లబ్బాయి, సీనియర్ నటులు నల్లూరి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.