
సుమన్‌బాబు, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి, ‘మహానటి’ ఫేం బేబీ సాయి తుషిత ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్ర చీర’. సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రంలో ‘ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ శ్రీరామ్ ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు.
సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్. మొదటి షెడ్యూల్‌లో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌ను తీశాం. ఈ నెల 15న ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్‌లో వినోదం, పోరాట సన్నివేశాలు తీస్తాం. శ్రీరామ్‌పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిళ్ళ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్.
Comments
Please login to add a commentAdd a comment