
అముద శ్రీనివాస్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘టీజర్ అద్భుతంగా ఉంది.
హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ చక్కని ప్రతిభ కనబరిచారు. టీజర్‌ని చూస్తుంటే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంతో ΄పోత్నాక్ శ్రవణ్ కుమార్‌కి మంచి లాభాలు రావాలి. అలాగే హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్‌కి మంచి అవకాశాలు రావాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్‌పి రాజా, కెమెరా: ఎంఎస్ కిరణ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment