వాస్తవంగా జరిగిన కథే.. నా నీ ప్రేమ కథ | Naa Nee Prema Katha Movie Updates | Sakshi
Sakshi News home page

వాస్తవంగా జరిగిన కథే.. నా నీ ప్రేమ కథ

Published Sat, Aug 26 2023 3:16 AM | Last Updated on Sat, Aug 26 2023 11:02 AM

Naa Nee Prema Katha Movie Updates - Sakshi

ఆముద శ్రీనివాస్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నా.. నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించారు. పోత్నాక్‌ శ్రవణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ఆముద శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది.

పేపర్‌బాయ్, డాక్టర్‌ల ప్రేమకథ ఈ చిత్రం. ప్రేమ ఎలా అయినా పుట్టొచ్చు అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘చాలా మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు పోత్నాక్‌ శ్రవణ్‌కుమార్‌. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, శోభారాణి మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement