
బేబీ సాయి తేజస్విని, వెంకటేశ్
శ్రీకాంత్ కీలక పాత్రలో, అలీ, బేబీ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు, కమల్ కామరాజు, అజయ్, శ్రీరాం ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్యసుమన్ బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలవుతోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యసుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్, సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. చేజింగ్ సీన్స్, హారర్, కామెడీ హైలైట్. షూటింగ్ ముగింపు దశలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఈ నెల చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రియాంక అగస్టీన్–రఘుబాబు– ఫిష్ వెంకట్‌ల ప్రత్యేక గీతం మా సినిమాలో మరో హైలైట్’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిల్ల.
Comments
Please login to add a commentAdd a comment