
‘పేట్టా’తో కెరీర్‌లో 165 సినిమాలను కంప్లీట్ చేశారు రజనీకాంత్. ఇప్పుడు 166వ చిత్రం కోసం రెడీ అవుతున్నారాయన. ఈ చిత్రానికి ‘గజినీ, తుపాకీ, కత్తి’ చిత్రాల ఫేమ్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అని, రజనీ కెరీర్‌లో చివరి సినిమా అవుతుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఇదే విషయమై మురుగదాస్‌ను అడగ్గా... ‘‘రజనీకాంత్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో నేను చేయబోయేది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కాదు.
అన్ని రకాల ప్రేక్షకులను అలరించే మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని స్పష్టం చేశారు. సో.. రజనీకాంత్ నెక్ట్స్ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కాదని క్లారిటీ వచ్చేసింది. ఇక ఇది రజనీకాంత్ కెరీర్‌లో చివరి మూవీ అవుతుందా? కాదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో కథానాయికలుగా కాజల్ అగర్వాల్, కీర్తీ సురేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘కత్తి’ చిత్రంలో కాజల్, లేటెస్ట్ ‘సర్కార్’ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయికలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. కాజల్, కీర్తీలో ఎవరో ఒకరు ఫిక్స్ అవుతారా? లేక మరో హీరోయిన్ ఎవరైనా తెరపైకి వస్తారా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment