
రజనీకాంత్, త్రిష
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా కొనసాగుతున్నారు త్రిష. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె భాగమయ్యారు. మంచి అవార్డులనూ సొంతం చేసుకున్నారు. నటన పట్ల ఎంతో తపన, ఇష్టం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే కానీ ఈ ఫీట్స్ సాధ్యం కావు. కానీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌లో ఉన్న క్వాలిటీస్‌లో తనకు పది శాతం ఉన్నా ఇంకా బెటర్‌గా ఉండేదాన్నని అంటున్నారు త్రిష. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రంలో నటించారు త్రిష. ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరిగింది.
అక్కడ త్రిష మాట్లాడుతూ– ‘‘కోలీవుడ్‌లో మరో రజనీకాంత్ రారు. ఆయనలో ఉన్న క్యాలిటీస్‌లో కనీసం పది శాతం నాలో ఉన్నా నేనూ ఇంకా బెటర్ పర్సన్ అయి ఉండేదాన్ని. ‘ఏదైనా పనికి ఒకసారి నువ్వు కమిట్ అయితే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే తిరిగి వెళ్లాలి’ అని రజనీకాంత్‌గారు షూటింగ్ టైమ్‌లో చెప్పిన విషయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది’’ అని పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘పేట్టా’లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి నటించారు త్రిష. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘పేట్టా’ సినిమా టీజర్ ఈ రోజు ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment