
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెట్ట. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. రజనీ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా సీనియర్ హీరోయిన్ సిమ్రన్ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.
రజనీతో తాను ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేసిన సిమ్రన్ ‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నన్ను నేను గిచ్చుకొని చూసుకున్నా’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
I'm super happy OMG I can't believe its happening just pinched myself 😊😊💃💃💃💃#PettaPongalParaak
— Simran (@SimranbaggaOffc) 14 November 2018
@rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @Nawazuddin_S @SasikumarDir @trishtrashers @sunpictures pic.twitter.com/0XzUDZEfZs