
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెట్ట’. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భారీ సెక్యూరిటీ మధ్య చిత్రీకరణ జరుగుతున్నా.. ఈ సినిమాకు కూడా లీకుల బెడద తప్పటం లేదు.
గతంలో సినిమాలో రజనీ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా లక్నోలో జరుగుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి రెండు సీన్స్ కూడా లీకైనట్టుగా చిత్రయూనిట్ గుర్తించారు. దీంతో షూటింగ్ లోకేషన్‌లో సెక్యూరిటీని మరింత పెంచినట్టుగా తెలుస్తోంది. దాదాపు 500 మంది నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment