Rajinikanth
-
హుకుం.. టైగర్ కా హుకుం...
ఇటీవల సరైన సక్సెస్‌లు లేక సతమతమవుతున్న నటుడు రజనీకాంత్‌కు నూతనోత్సాహాన్ని కలిగించిన చిత్రం జైలర్. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. నటి తమన్న ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 2023లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ తరువాత రజనీకాంత్ నటించిన లాల్ సలాం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తరువాత రజనీకాంత్ నటించిన వేట్టైయన్ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు.ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ మొదటి నుంచి చెబుతున్నారు. కాగా జైలర్ –2 చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను పొంగల్ సందర్భంగా మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేసి రజనీకాంత్ అభిమానులకు కానుకగా అందించారు. నాలుగు నిమిషాల పాటూ సాగే ఆ ట్రైలర్లో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ చిత్ర కథా చర్చల కోసం గోవా వెళతారు. అక్కడ వారు మాట్లాడుకుంటుండగా నటుడు రజనీకాంత్ రౌడీలను వెంటాడి వేటాడుతూ వస్తారు. దీంతో భయభ్రాంతులకు గురైన నెల్సన్, అనిరుధ్ ఈ సన్నివేశం బాగుందే దీన్నే కథగా రూపొందిద్దాం అని అనుకుంటారు. ట్రైలర్ చివరిలో రజనీకాంత్ హుక్కుమ్ టైగర్ కా హుక్కుమ్ అంటారు. మాస్ మసాలాగా రూపొందిన ఈ ట్రైలర్‌కు ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జైలర్– 2 చిత్ర షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థనే నిర్మిస్తోంది. -
అర్థమైందా.. రాజా!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్‌పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
రజనీకాంత్ బయోపిక్.. శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
'గేమ్ ఛేంజర్' తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందాయి. ఇందిరాగాంధీ, జయలలిత, కామరాజర్, భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. నటుడు ధనుష్ ఈ చిత్రంలో ఇళయరాజాగా నటించనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఈ చిత్రం ఇప్పుడు డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇప్పుడు నటుడు రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడు శంకర్ (Shankar) చేసిన వ్యాఖ్యలే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ (Game Changer) చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత దర్శకులు శంకర్ మరో సినిమాపై అడుగులు వేస్తున్నారు.తన తదుపరి చిత్రం గురించి శంకర్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను తెరకెక్కించాలన్న కోరికను వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లో 50 ఏళ్లుగా కథానాయకుడిగా ఏకచత్రాధిపత్యాన్ని సాగిస్తున్న రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కుతుందా..? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కాగా దర్శకుడు శంకర్ ఇప్పటికే రజనీకాంత్ హీరోగా శివాజీ, రోబో, 2.ఓ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ( ఇదీ చదవండి: ఊహలకు మించి డాకు మహారాజ్ ఉంటుంది: బాలకృష్ణ)కాగా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రాన్ని సిద్ధం అవుతారని తెలుస్తోంది. అదేవిధంగా దర్శకుడు శంకర్ వెల్పారి చిత్రాన్ని తెర రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి గతంలో ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఇందులో సూర్య, విక్రమ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన రజనీకాంత్ బయోపిక్ ఎప్పుడు తెరకెక్కిస్తారు ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. మంగళవారం నాడు ఆయన చెన్నై విమానాశ్రయంలో కనిపించగా అక్కడున్న మీడియా కొన్ని ప్రశ్నలడిగింది. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగ్గా రజనీ.. 70 శాతం పూర్తయిందని చెప్పాడు. మిగతాది జనవరి 13 నుంచి 28 మధ్య షూటింగ్ చేస్తామన్నాడు. ఇంతలో ఓ జర్నలిస్ట్.. తమిళనాడులో మహిళ భ్రదత గురించి ప్రశ్నించగా రజనీ అసహనం వ్యక్తం చేశాడు. రాజకీయ ప్రశ్నలు అడగవద్దని చెప్పాను కదా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఏం జరిగింది?గతేడాది డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియుడితో మాట్లాడుతోంది. వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి వారిని వీడియో చిత్రీకరించినట్లు వెలుగుచూసింది. ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేసి యువతిని భయపెట్టి లొంగదీసుకున్నట్లు బయటపడింది. లైంగికదాడికి పాల్పడటమే కాకుండా తను చెప్పినప్పుడల్లా రావాలని, తాను చెప్పే సార్ వద్దకు వెళ్లాలని హెచ్చరించడం గమనార్హం. ఇదే తరహాలో మరో అమ్మాయిని కూడా బెదిరింపులతో లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు డీఎంకే పార్టీ కార్యకర్త అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్ -
రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం
అభిమానులు లేనిదే ఏ హీరో లేడులే అన్నది వాస్తవం. అందుకే ప్రముఖ నటులు అభిమానులే మా దేవుళ్లు అంటుంటారు. ఈ అభిమానం అన్నది ఎంత వ్యసనం అంటే తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయితే చూడాలని తహ తహలాడుతుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా అభిమానులు సినిమాలు చూడటంతో సరిపెట్టుకోరు. కొందరు తమ అభిమాన నటీనటులకు గుడులు కట్టించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఇది అభిమానానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. ఇక నటుడు రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన్ను చూడటానికి అనేకమంది అభిమానులు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి సమయంలో రజనీకాంత్ ఇంటి గేటు వరకు వచ్చి చెయ్యి పైకెత్తి అభివాదం చేస్తే చాలు.. వాళ్ల జన్మ ధన్యమైనట్లు ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. కాగా అలాంటి వీరాభిమాని ఒకరు నటుడు రజనీకాంత్‌కు గుడి కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు.. అతని పేరు కార్తీక్. ఇతను ఓ మాజీ సైనికుడు కావడం విశేషం. మధురై జిల్లా, తిరుమంగంలో అతను రజనీకాంత్‌కు గుడి కట్టించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్ గార్డెన్‌లోని తన ఇంటికి రప్పించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి తన ఇంటిని చూపించి వారితో ఫొటోలు దిగి, బాబా విగ్రహాన్ని కానుకగా అందించి సంతోష పెట్టారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. #WATCH | Tamil Nadu: Fans of actor Rajinikanth offered prayers at Rajinikanth temple in Madurai on the occasion of his birth anniversary. pic.twitter.com/Ski0udt9sf— ANI (@ANI) December 12, 2023 -
50 ఏళ్ల వేడుక.. రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ సినిమా రీరిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన నరసింహ రీరిలీజ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 1999లో వచ్చిన ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో నీలాంబరిగా చాలా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. ఇందులో శివాజీ గణేశన్, సౌందర్య,నాజర్,అబ్బాస్ తదితరులు నటించారు. తమిళ్లో సంచలన విజయం అందుకున్న ఈ మూవీ తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నుంచి రజనీకాంత్‌కు ఇక్కడ మార్కెట్ కూడా పెరిగింది.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నరసింహ (Narasimha) సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదితో రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాను ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పుడు థియటర్స్లోకి తీసుకొచ్చే విషయాన్ని ఆయన చెప్పలేదు. కానీ, ఈ చిత్రం 2025 ఆగష్టులో విడుదల కావచ్చని తెలుస్తోంది. రజనీ నటించిన తొలి సినిమా అపూర్వ రాగంగళ్ 1975 ఆగస్టు 18న విడుదలైంది. దీంతో అప్పటికి ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ సమయానికి నరసింహ సినిమాను రీరిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో రజనీ నటించిన హిట్ చిత్రాలు మళ్లీ బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేశాయి. అందులో భాషా, బాబా, దళపతి ఉన్నాయి. ఇప్పుడు నరసింహ మూవీ మళ్లీ విడుదల కానున్నడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.నరసింహ సినిమా 1999లో 200 ప్రింట్స్‌తో విడుదలైంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 86 థియేటర్ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా ప్రాంతాలలో 200 రోజులకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లు రాబట్టింది. ఆ సమయంలో అమెరికాలో రూ. 3 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత రజనీ లుక్‌ను బీడీలు, సిగరెట్లు పొగాకు వంటి వాటిపై ట్రేడ్‌మార్క్‌గా రైట్స్ కొనుగోలు చేశారు. -
ఫ్యాన్స్ కు తలైవా విషెస్.
-
గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
గుకేశ్‌కు రజనీకాంత్ సన్మానం.. గిఫ్ట్ ఇచ్చిన శివకార్తికేయన్
వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి గుకేశ్ (D Gukesh)కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అతడిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) అభినందించారు. రజనీ.. గుకేశ్‌కు శాలువా కప్పడంతో పాటు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. పిలిచి మరీ తనకు సమయం కేటాయించినందుకు రజీకాంత్కు గుకేశ్ ధన్యవాదాలు తెలిపాడు.గిఫ్ట్ ఇచ్చిన హీరోఅటు శివకార్తికేయన్.. చెస్ ఛాంపియన్‌తో కేక్ కట్ చేయించి వాచ్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. అంతేకాదు, స్వయంగా తనే అతడి చేతికి వాచీ ధరింపజేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను గుకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివకార్తికేయన్ సర్ ఎంత మంచివారో.. తన బిజీ షెడ్యూల్లోనూ నాతో పాటు నా కుటుంబంతో ఉండేందుకు సమయం కేటాయించారు అని ఎక్స్ (ట్విటర్)లో తన సంతోషాన్ని పంచుకున్నాడు.జగజ్జేతగా గుకేశ్కాగా సింగపూర్ సిటీలో జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి చదరంగం రారాజుగా అవతరించాడు. Thanks Superstar @rajinikanth sir for your warm wishes and inviting ,spending time and sharing your wisdom with us 🙏 pic.twitter.com/l53dBCVVJH— Gukesh D (@DGukesh) December 26, 2024 Had a great time with @Siva_Kartikeyan sir and he was kind enough to spend time with me and my family despite his busy schedule and enjoyed a lot! pic.twitter.com/GnnGx3wDs4— Gukesh D (@DGukesh) December 26, 2024చదవండి: సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందా? -
సంక్రాంతికి కొత్తకబురు
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ‘జైలర్ 2’ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి, రజనీకాంత్ పాల్గొనగా నెల్సన్ అండ్ టీమ్ ఓ వీడియోను రికార్డు చేసిందని, సంక్రాంతికి ‘జైలర్ 2’ అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల జైపూర్‌లో పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ను కోయంబత్తూర్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. -
జైలర్ మూవీ కమెడియన్‌తో నటి పెళ్లి.. అదే నాన్న చివరి కోరిక (ఫోటోలు)
-
‘ఒరే తలైవర్’ అంటూ బర్త్‌డే విషెస్.. హీరోయిన్‌పై రజనీ ఫ్యాన్స్ ఫైర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న తన పుట్టినరోజు జరుపుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి దుషారా విజయన్ ‘ఒరే తలైవర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్‌కి చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి. రజనీకాంత్ గౌరవం తగ్గించి ఒరే తలైవర్ అంటూ పోస్ట్ చేయడాన్ని తెలుగు నెటిజన్స్ తప్పుబట్టారు. ఒరే అంటే ఒరేయ్ అని తెలుగువాళ్లు అనుకున్నారు. అయితే తమిళంలో ‘ఒరే’ అంటే ఒక్కరే అని అర్థం. అందుకే ‘ఒరే తలైవర్’ (సూపర్‌స్టార్ ఒక్కరే) అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు దుషారా. అంతేకానీ రజనీని అవమానించే విధంగా ఒరే అనే పదాన్ని ఎక్కడా వాడలేదంటూ తమిళ్ తెలిసిన వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఫ్యాషన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుషారా ‘బోదై ఏరి బుదద్ధి మారి’ (2019) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తక్కువ సమయంలోనే రజనీకాంత్ (వేట్టయాన్), ధనుశ్ (రాయన్), విక్రమ్ (వీర ధీర శూరన్ 2) వంటి స్టార్ హీరోల సినిమాలల్లో నటించే అవకాశం అందుకున్నారు దుషారా. ఇలా కెరీర్ పరంగా ఈ బ్యూటీ దూసుకెళుతున్నారు. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో రజినీకాంత్.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్.. గురువారం 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే కొందరు మాత్రం టెక్నాలజీ ఉపయోగించి తలైవాని సరికొత్తగా చూపించారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్)ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. సాధ్యం కాని వాటిని కూడా ఈ సాంకేతికత ఉపయోగించి సృష్టిస్తున్నారు. ఇలానే ఇప్పుడు రజినీకాంత్‌ని కూడా హాలీవుడ్ క్లాసిక్ సినిమాలు-వెబ్ సిరీసులైన 'పీకీ బ్లండర్స్', 'రాకీ', 'టాప్ గన్', 'గ్లాడియేటర్', 'గాడ్ ఫాదర్', 'స్టార్ వార్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'టైటానిక్', 'మ్యాట్రిక్స్' సినిమాల హీరోల గెటప్స్‌లో రజినీ కనిపించడం ఇంట్రెస్టింగ్గా ఉంది.(ఇదీ చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)Mass😍😍😍😍#Thalaivar #ThalaivarBirthday #Superstar #SuperstarRajinikanth #ThalaivarForLife pic.twitter.com/I6lbDKjLqw— Dr.Ravi (@imravee) December 12, 2024 -
ఎవర్గ్రీన్ స్టైలిష్ స్టార్.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
థర్టీ ఇయర్స్ తర్వాత...
‘కూలీ’ సినిమా కోసం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ , సత్యరాజ్, రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో ఆమిర్‌ఖాన్ నటిస్తున్నారు. ‘కూలీ’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జైపూర్‌లో మొదలైందని కోలీవుడ్ సమాచారం.రజనీ, ఆమిర్‌తో పాటుగా ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌ఖాన్ నటిస్తారనే ప్రచారం గతంలో సాగింది. తాజాగా ఆయన జైపూర్‌కు వెళ్లడంతో ఈ మూవీలో ఓ రోల్లో నటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. 1995లో వచ్చిన ‘అతంక్ హీ అతంక్’ సినిమాలో రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ‘కూలీ’ కోసం రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ మే 1న రిలీజ్ కానుందని టాక్. -
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
టాప్-10 హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ హీరోల లిస్ట్ ఇదే
-
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
'జైలర్' అభిమానులకు శుభవార్త
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం తరువాత రజనీకాంత్ కోసం మరో చిత్రం ఎదురు చూస్తోంది. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన అందులో నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌కు భార్యగా నటించగా, నటి తమన్నా ప్రత్యేక పాత్రలో మెరిశారు. కాగా జైలర్ చిత్రం నిర్మా ణ దశలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ పేర్కొన్నారు. దీంతో ఈయన జైలర్– 2 చిత్ర కథను తయారు చేసే పనిలో ఉన్నారు. తా జాగా కథను రెడీ చేసి నెల్సన్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధం అయ్యారని సమాచారం. ఈ చిత్రానికి 'హుకూమ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాకపోయినా ప్రస్తుతం 'హుకూమ్' చిత్రం గురించి అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిశంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన పనులు స్థానిక పూందమల్లిలోని ఈవీపీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియోను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే రజనీకాంత్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
రజినీకాంత్ VS కమల్ హాసన్ బాక్సాఫీస్ ఫైట్
-
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.విజయ్ గెలుపు అసాధ్యంకానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు.