Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి! | Bhool Bhulaiyaa 3: Triptii Dimri joins Kartik Aaryan in horror comedy | Sakshi
Sakshi News home page

Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!

Published Thu, Feb 22 2024 1:06 AM | Last Updated on Thu, Feb 22 2024 1:06 AM

Bhool Bhulaiyaa 3: Triptii Dimri joins Kartik Aaryan in horror comedy - Sakshi

బాలీవుడ్‌ హారర్‌ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్‌ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్‌ భూలయ్యా’, 2022లో విడుదలైన  ‘భూల్‌ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్‌ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది.

అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్, విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్‌ భూలయ్యా’ ఫ్యామిలీలో  ‘యానిమల్‌’ ఫేమ్‌ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్‌’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement