
తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఈ కోవలో ‘వస్తా’ అనే సినిమా రానుంది. సీనియర్ నటుడు భానుచందర్, జీవా, ‘అదిరే’ అభి, ఫణి ముఖ్య పాత్రల్లో జంగాల నాగబాబు దర్శకత్వంలో దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మిస్తున్నారు.
తొలి షెడ్యూల్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ జోనర్‌లో వచ్చిన ఎన్నో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. అదే స్ఫూర్తితో ‘వస్తా’ సినిమా చేస్తున్నాం. థ్రిల్‌కు గురి చేసే సినిమా ఇది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment