Bhanu Chandar
-
మళ్లీ జగనే సీఎం
-
రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పా: భాను చందర్
Actor Bhanu Chandar About SS Rajamouli: సీనియర్ హీరో, నటుడు బానుచందర్ క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో భాను చందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 80, 90ల్లో స్టార్ హీరోగా చక్రం తిప్పిన ఆయన పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్వవహరించారు. మ్యుజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన బాను చందర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌ను పలకరిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. చదవండి: గర్ల్‌ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ? మ్యూజిషియన్‌గా ఉన్న ఆయన నటుడిగా ఎలా మారారో తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘చంటిబాబు మా నాన్న దగ్గర పనిచేసేవారు. ఆయన కుమార్తె ఫిలిం ఇన్సిట్యూట్‌లో చేరింది. రజనీకాంత్ క్లాస్మేట్ ఆమె. అదే సమయంలో నేను ముంబైకి వెళ్లాను. అక్కడ విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం, చెడు అలవాట్లతో ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇంట్లో ఎంత చెప్పినా వినలేదు. చివరికి అమ్మ ఒత్తిడితో చెన్నై వచ్చాను. ఈ డ్రగ్స్ నుంచి బయటపడేందుకు మా అన్నయ్య నన్ను మర్షల్ ఆర్ట్స్‌లో చేర్పించాడు. తైక్వాండోతో చెడు అలవాట్లు అన్ని పోయాయి. అలా మార్షన్ అర్ట్స్లో బ్లాక్ బెల్డ్ సాధించా. ఆ తర్వాత నా కెరీర్ మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. అనంతరం రాజమౌళిపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ ‘‘రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని 12 ఏళ్ల క్రితేమ చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది కదా! ‘సింహాద్రి సినిమా చేసినప్పుడే రాజమౌళితో ఈ మాట చెప్పాను. నా డబ్బింగ్ సమయంలో ఆయనను పిలిచి ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. కానీ మీరు అందుబాటులోకి రారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు దేశం గర్వించే గొప్ప దర్శకులు అవుతారు’ అని చెప్పాను. అంతేకాదు ఆయన దగ్గరి నుంచి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా హిట్ చేయాలనే టెక్నిక్‌ను చాలామంది నేర్చుకోవాలి. రాజమౌళి మట్టిని చాక్లెట్ పేపర్లో పెట్టి వండర్ఫుల్ చాక్లెట్ అని అమ్మగలరు. ఇలా ఎంతమంది చేయగలరు. ఎవరు పడితే వాళ్లు చేయలేరు. దానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. అది రాజమౌళిలో చాలా ఉంది” అని ఆయన అన్నారు. కాగా సింహాద్రిలో భాను చందర్ భూమిక తండ్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సుమన్, భాను చందర్ కీలక పాత్రల్లో ‘సేవాదాస్’, రిలీజ్ ఎప్పుడంటే
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ డైరెక్టర్ కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం ‘సేవాదాస్’. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైద్రాబాద్‌లోని ఎంబీ మాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఆదివాసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ భూక్య భారతి, ఐ.ఎ. ఎస్., ఐ.టి.కమిషనర్ పీర్యా నాయక్, లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త రమేష్ నాయక్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సేవాదాస్ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను.. ఆలిండియా ఆదివాసీ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్‌లు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నెల(ఫిబ్రవరి) 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో వినోద్ రైనా, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ తదితరులు నటించారు. -
'చంద్రబాబు నైజం ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు'
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం నీచమని సినీ నటుడు భానుచందర్ అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయం దారుణం. చంద్రబాబు నైజం గురించి ఎన్టీఆర్ ఆనాడే స్ఫష్టంగా చెప్పారు. ఆయన నాతో చెప్పిన మాటలు చెప్తే చంద్రబాబుకు పుట్టగతులుండవు. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’) వైఎస్ జగన్ సంక్షేమపథకాలతో ప్రజలకి దగ్గర కావడం సహించలేకపోతున్నారు. అందుకే ఇటువంటి కుట్రపూరిత కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్లు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా మరో 15 ఏళ్లు సీఎంగా వైఎస్ జగన్ కొనసాగుతారు' అని సినీ నటుడు భానుచందర్ పేర్కొన్నారు. చదవండి: (టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోంది: మల్లాది విష్ణు) -
వైఎస్సార్ సీపీలో చేరిన భానుచందర్
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సినీ నటుడు భానుచందర్ వైఎస్సార్ సీపీలో చేరారు. జననేత పార్టీ కండువా కప్పి భానుచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్ర ముగింపు ఘట్టంలో పాల్గొన్న భానుచందర్ మాట్లాడుతూ... ప్రజల కోసం తపించే వైఎస్ జగన్ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. జనంతో ఇంతగా కలిసిపోయే నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని పేర్కొన్నారు. 2019 నుంచి మరో 20 సంవత్సరాల పాటు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు. కాగా కొన్నిరోజుల క్రితమే భానుచందర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గతేడాది డిసెంబర్లో వైఎస్ జగన్‌ను భానుచందర్ కలిశారు. ఆరోజే తాను పార్టీలో చేరే విషయంపై చర్చించారు. -
సేవ చేయాలనే వైఎస్సార్ సీపీలోకి..
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నలభై సంవత్సరాల పాటు సినీ కళామతల్లి నీడలో ఎన్నో వైవిద్యభరిత పాత్రలు పోషించానని, ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీలో చేరినట్టు సినీనటుడు భానుచందర్ అన్నారు. సోమవారం దొండపర్తిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిలో ఓ బుద్ధుడ్ని చూశానని చెప్పారు. ఔధార్యం, ఓర్పు, సహనంతో పాటు ప్రజలు కష్టాలు తెలుసుకున్న మంచి వ్యక్తి జగన్ అని తెలిపా రు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆత్మ ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిలో ఉందని వివరించారు. పార్టీలో చేరిన విషయంపై తన స్నేహితుడు సుమన్‌తో కూడా చర్చించానని తెలిపారు. తన కుమారుడు జయంతి మొదటి చిత్రం మిక్చర్ పొట్లాంను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రెండో చిత్రం విడుదలౌతుందని, ఆదరించాలని కోరారు. మార్షల్ ఆర్ట్స్ ఇతివృత్తంగా చిత్రాలు ప్రస్తుతం కరువయ్యాయన్నారు. తాను నటించిన ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని, తాను డీఎస్పీగా నటనకు ఆస్కారమున్న పాత్ర పోషించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాçష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పెనుమత్స శ్రీనివాస్‌రాజు, దినేష్‌రెడ్డి, బాషా, శ్రీనివాసరావు, పార్టీ విశాఖ పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
వస్తా.. ఓ థ్రిల్!
తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఈ కోవలో ‘వస్తా’ అనే సినిమా రానుంది. సీనియర్ నటుడు భానుచందర్, జీవా, ‘అదిరే’ అభి, ఫణి ముఖ్య పాత్రల్లో జంగాల నాగబాబు దర్శకత్వంలో దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ జోనర్లో వచ్చిన ఎన్నో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. అదే స్ఫూర్తితో ‘వస్తా’ సినిమా చేస్తున్నాం. థ్రిల్‌కు గురి చేసే సినిమా ఇది’’ అన్నారు. -
ఆగస్టులో తొలి కిరణం
పి.డి రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్ ముఖ్య తారలుగా జె. జాన్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. టి.సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ‘‘యేసు సిలువ వేసిన తర్వాత, ఆయన అక్కడే ఉన్న 40 రోజులు ఏం జరిగిందన్న కథతో సినిమా ఉంటుంది. సుమారు గంట గ్రాఫిక్స్ ఉంటాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘యేసు పాత్ర చేయడం నా అదృష్టం’’ అని పీడీ రాజు అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: కె సువార ్తపాల్.