Actor Bhanu Chandar About SS Rajamouli: సీనియర్ హీరో, నటుడు బానుచందర్ క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో భాను చందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 80, 90ల్లో స్టార్ హీరోగా చక్రం తిప్పిన ఆయన పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్వవహరించారు. మ్యుజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన బాను చందర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌ను పలకరిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ?
మ్యూజిషియన్‌గా ఉన్న ఆయన నటుడిగా ఎలా మారారో తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘చంటిబాబు మా నాన్న దగ్గర పనిచేసేవారు. ఆయన కుమార్తె ఫిలిం ఇన్సిట్యూట్‌లో చేరింది. రజనీకాంత్ క్లాస్‌మేట్ ఆమె. అదే సమయంలో నేను ముంబైకి వెళ్లాను. అక్కడ విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం, చెడు అలవాట్లతో ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇంట్లో ఎంత చెప్పినా వినలేదు. చివరికి అమ్మ ఒత్తిడితో చెన్నై వచ్చాను. ఈ డ్రగ్స్ నుంచి బయటపడేందుకు మా అన్నయ్య నన్ను మర్షల్ ఆర్ట్స్‌లో చేర్పించాడు. తైక్వాండోతో చెడు అలవాట్లు అన్ని పోయాయి. అలా మార్షన్ అర్ట్స్‌లో బ్లాక్ బెల్డ్ సాధించా. ఆ తర్వాత నా కెరీర్ మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. అనంతరం రాజమౌళిపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్
‘‘రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని 12 ఏళ్ల క్రితేమ చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది కదా! ‘సింహాద్రి సినిమా చేసినప్పుడే రాజమౌళితో ఈ మాట చెప్పాను. నా డబ్బింగ్ సమయంలో ఆయనను పిలిచి ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. కానీ మీరు అందుబాటులోకి రారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు దేశం గర్వించే గొప్ప దర్శకులు అవుతారు’ అని చెప్పాను. అంతేకాదు ఆయన దగ్గరి నుంచి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా హిట్ చేయాలనే టెక్నిక్‌ను చాలామంది నేర్చుకోవాలి. రాజమౌళి మట్టిని చాక్లెట్ పేపర్‌లో పెట్టి వండర్‌ఫుల్ చాక్లెట్ అని అమ్మగలరు. ఇలా ఎంతమంది చేయగలరు. ఎవరు పడితే వాళ్లు చేయలేరు. దానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. అది రాజమౌళిలో చాలా ఉంది” అని ఆయన అన్నారు. కాగా సింహాద్రిలో భాను చందర్ భూమిక తండ్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment