అదృశ్య శక్తులుఏం చేస్తాయి? | Anjali turns singer for her film Chitrangada | Sakshi
Sakshi News home page

అదృశ్య శక్తులుఏం చేస్తాయి?

Published Sun, Jul 10 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

అదృశ్య శక్తులుఏం చేస్తాయి?

అదృశ్య శక్తులుఏం చేస్తాయి?

రెండేళ్ల క్రితం గీతాంజలిగా అంజలి చేసిన హారర్ కామెడీ గుర్తుందా..?  ఇప్పుడు ‘చిత్రాంగద’ సినిమాలో టైటిల్ రోల్‌లో మరోసారి అలరించనున్నారు అంజలి. ‘పిల్ల జమీందార్’  ఫేం అశోక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న  ఈ చిత్రంలో అంజలి ఓ పాట పాడటం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ సినిమా.
 
 చిత్రనిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ- ‘‘కొన్ని అదృశ్య శక్తుల కారణంగా చిత్రాంగద అనే యువతి జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అనే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం ఉంటుంది. అమెరికాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గ్రాఫిక్స్ వర్క్ క్వాలిటీగా చేయడం వల్లే సినిమా ఆలస్యం అవుతోంది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement