Chitrangada
-
బర్త్‌డే ప్లాన్ రెడీ
బర్త్‌డేకి కేక్ కట్ చేయడంతోపాటు థియేటర్లో బుల్లెట్స్‌ను పేల్చుతానంటున్నారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. తిగ్మాన్షు థూలియా దర్శకత్వంలో సంజయ్‌దత్, జిమ్మి షెర్గిల్, మహి గిల్, చిత్రాంగద సింగ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘సాహెబ్ బిబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’. 2011లో వచ్చిన ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’, 2013లో ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’లను డైరెక్ట్ చేసిన థూలియా దర్శకత్వంలో రూపొందుతున్న మూడోపార్ట్ ఇది. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని బాలీవుడ్ సమాచారం. అయినా ఇప్పుడు రిలీజ్ చేయరట. మంచి డేట్ కోసం చూస్తున్నారని సమాచారం. ఆ డేట్ సంజయ్ దత్ బర్త్‌డే డేట్ అని భోగట్టా. జూలై 29న సంజూ బాబా బర్త్‌డే. అదే రోజున ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. -
మరోసారి ప్రూవ్ చేసుకున్నా : అంజలి
‘‘మనం పునర్జన్మ అనే పాయింట్‌ను నమ్ముతాం. ఓ మగవాడు చనిపోయి ఆడపిల్లగా పుడితే ఎలా ఉంటుందో చెప్పే చిత్రమే ‘చిత్రాంగద’. కొత్త పాయింట్‌కు థ్రిల్లర్ ఎలిమెంట్ జోడించి తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనడానికి నిదర్శనం మా చిత్రం’’ అని దర్శకుడు జి. అశోక్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ‘చిత్రాంగద’ గత శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ‘‘అశోక్‌గారు మంచి కథనంతో ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా చేశారు. అంజలి నటన, అశోక్ టేకింగ్ మా చిత్రం సక్సెస్‌కి కారణం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘అశోక్‌గారు చిత్రాంగద వంటి క్యారెక్టర్ ఇచ్చి మరోసారి నన్ను నేను ప్రూవ్ చేసుకునేలా చేశారు. నిర్మాతలు క్వాలిటీతో తీశారు. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు’’ అని అంజలి చెప్పారు. ‘‘చిత్రాంగద’ విడుదలైన రోజు నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ముందుకు సాగుతోంది. ఓవర్సీస్లో కూడా మంచి రిపోర్ట్ వచ్చింది’’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. -
చిత్రాంగద కోసం హార్డ్ వర్క్ చేశా
‘‘గీతాంజలి’’ చిత్రం తర్వాత నేను చేసిన∙లేడీ ఓరియంటెడ్ మూవీ ‘చిత్రాంగద’. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన సినిమా. ఈ చిత్రం కోసం చాలా హార్డ్‌వర్క్ చేశా’’ అని అంజలి అన్నారు. ఆమె టైటిల్ రోల్లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ నేడు విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథ ఇది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలుంటాయి’’ అన్నారు. ‘‘గీతాంజలి’ కంటే అంజలి ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘చిత్రాంగద’. సినిమాపై నమ్మకంతో డిస్టిబ్య్రూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేసేందుకు ముందుకొచ్చారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్. -
అంజలి భయపడలేదు!
‘‘ఇండియాలో కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు 18 కోట్లమంది ఉన్నారని గర్వంగా చెబుతున్నాం. కొత్తగా తీసిన చిత్రాలు చూడడానికి కనీసం ఐదు కోట్లమంది రాకపోతారా? వస్తారనే నమ్మకం నాకుంది’’ అన్నారు దర్శకుడు అశోక్. అంజలి ముఖ్యతారగా అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ‘చిత్రాంగద’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ చెప్పిన సంగతులు.... ► పురాణాల్లోకి వెళితే... అర్జునుడి భార్యల్లో చిత్రాంగద ఒకరు. ఆమె మణిపూర్ మహారాణి. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా పెరుగు తుంది. బాగా గట్స్ ఉన్న లేడీ. మా సినిమాలో హీరోయిన్ కూడా మంచి గట్స్ ఉన్న అమ్మాయి. అందుకే, ‘చిత్రాంగద’ అని టైటిల్ పెట్టాను. ► ప్రపంచ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కొత్త పాయింట్ తో ఈ సినిమా తీశాం. ఇది హారర్ సినిమానా? లేక థ్రిల్లరా? అనిపిస్తుం ది. ఓ అమ్మాయికి వ్యక్తిగత సమస్యలు ఎదురైతే ఒక్కో స్టేజిలో తను ఎలా మారుతుందనేది కథ. మొండితనం, పట్టుదల గల ఓ అమ్మాయి లైఫ్ జర్నీ. థియేటర్లో ప్రేక్షకుడు ఓ కథ అనుకుంటే.. పారలల్‌గా మరో కథ నడుస్తుంది. క్లైమాక్స్‌లో అది అర్థమవుతుంది. ► ఇందులో అంజలి అల్ట్రా గ్లామరస్‌గా... క్యారెక్టర్ పరంగా షార్ట్స్ వేసుకుని నటించింది. అమెరికాలో మైనస్ 11 డిగ్రీల టెంపరేచర్లో చిత్రీకరించాం. ఫుల్ డ్రెస్సుల్లో ఉన్న అమెరికన్స్ షార్ట్స్ వేసుకున్న అంజలిని విచిత్రంగా చూసేవారు. చలికి సప్తగిరికి కూడా భయపడ్డారు. కానీ, అంజలి భయపడలేదు. తన మొండితనం, పట్టుదల చూసి రియల్ లైఫ్‌లో ఆమె ‘చిత్రాంగద’ అనిపించింది. ► తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరుగా షూట్ చేశాం. తెలుగులో ఈ నెల 10న, తమిళంలో రెండు వారాల తర్వాత రిలీజ్ చేస్తాం. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మల్కాపురం శివకుమార్ విడుదల విషయంలో సహకరిస్తున్నారు. ► అనుష్కతో తీస్తున్న ‘భాగమతి’ బయోపిక్ కాదు. ఫిక్షనల్ స్టోరీ. మరో ఆరేడు రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ∙డబ్బులు తీసుకొచ్చే ప్రతి సినిమా నిర్మాతకు కమర్షియల్ సినిమానే. కంగనా ‘తను వెడ్స్ మను’ సిరీస్ 300 కోట్లకుపైగా వసూలు చేసింది. మూడేళ్లుగా మహిళలు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రాలు వెయ్యి కోట్లు వసూలు చేశాయి. ఫార్ములా బేస్డ్ కమర్షియల్ చిత్రాలెప్పుడూ ఉంటాయి. కానీ, యువతరం మాత్రం కొత్త సినిమాలకు ఓటేస్తున్నారు. ‘చిత్రాందగ’ వంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్‌ను ఆదరిస్తున్నారు. -
థ్రిల్లింత.. నవ్వింత...
‘‘కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొంది?’’ అన్నదే ‘చిత్రాంగద’ కథాంశం’’ అని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో విడుదలవుతోంది. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో సురక్‡్ష ఎంటర్టైన్ మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజున ఈ చిత్రం విడుదల కానుంది. ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ కామెడీ జానర్లో రూపొందిన చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉంటుంది. స్కీ్రన్ లైట్‌గా ఉన్న ఈ చిత్రంలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను షాక్ గురి చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, కెమెరా: బాల్‌రెడ్డి (హైదరాబాద్), జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి. -
షాకింగ్ ట్విస్టులు!
కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఓ యువతి జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడిందనే కథతో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘చిత్రాంగద’. అంజలి టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకుడు. తమిళంలో ‘యార్నీ’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి సెల్వగణేశ్, స్వామినాథన్ సంగీత దర్శకులు. త్వరలో పాటల్ని, వచ్చే నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ ప్రకటించారు. ఇంకా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటి వరకూ భారతీయ తెరపై ఎవరూ టచ్ చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రమిది. అంజలి నటన, ఆమె పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ప్రేక్షకుల ఊహలకు అందని షాకింగ్ ట్విస్టులతో ప్రారంభం నుండి ముగింపు వరకూ ఉత్కంఠగా, ఆసక్తికరంగా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు. కథానుగుణంగా అమెరికాలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం’’ అన్నారు. సింధూ తులానీ, రక్ష, దీపక్, సాక్షీ గులాటీ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: టీసీఎస్రెడ్డి, వెంకట్ వాడపల్లి. -
అదృశ్య శక్తులపై పోరాటం
‘గీతాంజలి’ తర్వాత మరోసారి అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘చిత్రాంగద’. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘చిత్రాంగద’, తమిళంలో ‘యార్ నీ’ పేరుతో విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది. కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఎలా చిక్కుల్లో పడింది? వాటి నుంచి బయట పడే క్రమంలో ఆమెకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అన్నదే కథాంశం. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసి, అభిషేక్ పిక్చర్స్ వారు తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్త హక్కులు సొంతం చేసుకున్నారు. త్వరలో పాటలను, డిసెంబరు మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి: సంగీతం: సెల్వ గణేష్-స్వామి నాథన్, కెమెరా: బాల్‌రెడ్డి, సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి. -
అదృశ్య శక్తులుఏం చేస్తాయి?
రెండేళ్ల క్రితం గీతాంజలిగా అంజలి చేసిన హారర్ కామెడీ గుర్తుందా..? ఇప్పుడు ‘చిత్రాంగద’ సినిమాలో టైటిల్ రోల్లో మరోసారి అలరించనున్నారు అంజలి. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అంజలి ఓ పాట పాడటం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ సినిమా. చిత్రనిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ- ‘‘కొన్ని అదృశ్య శక్తుల కారణంగా చిత్రాంగద అనే యువతి జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అనే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం ఉంటుంది. అమెరికాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గ్రాఫిక్స్ వర్క్ క్వాలిటీగా చేయడం వల్లే సినిమా ఆలస్యం అవుతోంది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి. -
ఇప్పటివరకూ టచ్ చేయలేదు!
‘గీతాంజలి’తో ప్రేక్షకులను భయపెట్టిన కథానాయిక అంజలి తాజాగా మరో హారర్ చిత్రంతో తెర మీదకు రావడానికి రెడీ అవుతున్నారు. సినిమా పేరు - ‘చిత్రాంగద’. గతంలో ‘పిల్ల జమీందార్’ తీసిన జి. అశోక్ దర్శకత్వంలో అంజలి కథానాయికగా గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘అమెరికాలో తొమ్మిది రాష్ట్రాల్లో చిత్రీ కరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రమిది. ఇలాంటి కథాంశాన్ని ఎవరూ టచ్ చేయ లేదు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు. అంజలి మాట్లాడుతూ, ‘‘ ‘గీతాంజలి’ తర్వాత హారర్ సినిమా చేయకూడ దనుకున్నా. కానీ అశోక్‌గారు చెప్పిన కథ డిఫరెంట్‌గా అనిపించింది. ఈ సినిమాలో కొత్త అంజలిని చూస్తారు’’ అన్నారు. నవంబర్ ఆఖరులో పాటల్నీ, డిసెంబరులో చిత్రాన్నీ విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
అమెరికాలో ‘చిత్రాంగద’
‘గీతాంజలి’గా అలరించిన అంజలి, ఈసారి ‘చిత్రాంగద’గా రానున్నారు. ఈ థ్రిల్లర్, కామెడీ మూవీని అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరిపారు. యూరప్, కేరళల్లో చిత్రీకరించే పాటలతో సినిమా పూర్తవుతుందనీ, వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.