మరోసారి ప్రూవ్ చేసుకున్నా : అంజలి
‘‘మనం పునర్జన్మ అనే పాయింట్‌ను నమ్ముతాం. ఓ మగవాడు చనిపోయి ఆడపిల్లగా పుడితే ఎలా ఉంటుందో చెప్పే చిత్రమే ‘చిత్రాంగద’. కొత్త పాయింట్‌కు థ్రిల్లర్ ఎలిమెంట్ జోడించి తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనడానికి నిదర్శనం మా చిత్రం’’ అని దర్శకుడు జి. అశోక్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ‘చిత్రాంగద’ గత శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ‘‘అశోక్‌గారు మంచి కథనంతో ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా చేశారు.
అంజలి నటన, అశోక్ టేకింగ్ మా చిత్రం సక్సెస్‌కి కారణం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘అశోక్‌గారు చిత్రాంగద వంటి క్యారెక్టర్ ఇచ్చి మరోసారి నన్ను నేను ప్రూవ్ చేసుకునేలా చేశారు. నిర్మాతలు క్వాలిటీతో తీశారు. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు’’ అని అంజలి చెప్పారు. ‘‘చిత్రాంగద’ విడుదలైన రోజు నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ముందుకు సాగుతోంది. ఓవర్‌సీస్‌లో కూడా మంచి రిపోర్ట్ వచ్చింది’’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు.