చిత్రాంగద కోసం హార్డ్ వర్క్ చేశా
‘‘గీతాంజలి’’ చిత్రం తర్వాత నేను చేసిన∙లేడీ ఓరియంటెడ్ మూవీ ‘చిత్రాంగద’. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన సినిమా. ఈ చిత్రం కోసం చాలా హార్డ్‌వర్క్ చేశా’’ అని అంజలి అన్నారు. ఆమె టైటిల్ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ నేడు విడుదల చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథ ఇది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలుంటాయి’’ అన్నారు. ‘‘గీతాంజలి’ కంటే అంజలి ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘చిత్రాంగద’. సినిమాపై నమ్మకంతో డిస్టిబ్య్రూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేసేందుకు ముందుకొచ్చారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్.