అదృశ్య శక్తులపై పోరాటం | Anjali plays the title role in the film Chitrangada | Sakshi
Sakshi News home page

అదృశ్య శక్తులపై పోరాటం

Published Thu, Nov 24 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

అదృశ్య శక్తులపై పోరాటం

అదృశ్య శక్తులపై పోరాటం

‘గీతాంజలి’ తర్వాత మరోసారి అంజలి టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘చిత్రాంగద’. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘చిత్రాంగద’, తమిళంలో ‘యార్ నీ’ పేరుతో విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది.

కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఎలా చిక్కుల్లో పడింది? వాటి నుంచి బయట పడే క్రమంలో ఆమెకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అన్నదే కథాంశం. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసి, అభిషేక్ పిక్చర్స్ వారు తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్త హక్కులు సొంతం చేసుకున్నారు. త్వరలో పాటలను, డిసెంబరు మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి: సంగీతం: సెల్వ గణేష్-స్వామి నాథన్, కెమెరా: బాల్‌రెడ్డి, సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement