
సంజయ్‌దత్
బర్త్‌డేకి కేక్ కట్ చేయడంతోపాటు థియేటర్‌లో బుల్లెట్స్‌ను పేల్చుతానంటున్నారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. తిగ్‌మాన్షు థూలియా దర్శకత్వంలో సంజయ్‌దత్, జిమ్మి షెర్గిల్, మహి గిల్, చిత్రాంగద సింగ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘సాహెబ్ బిబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’.
2011లో వచ్చిన ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’, 2013లో ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’లను డైరెక్ట్ చేసిన థూలియా దర్శకత్వంలో రూపొందుతున్న మూడోపార్ట్ ఇది. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని బాలీవుడ్ సమాచారం. అయినా ఇప్పుడు రిలీజ్ చేయరట. మంచి డేట్ కోసం చూస్తున్నారని సమాచారం. ఆ డేట్ సంజయ్ దత్ బర్త్‌డే డేట్ అని భోగట్టా. జూలై 29న సంజూ బాబా బర్త్‌డే. అదే రోజున ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment