
‘‘సక్సెస్, ఫెయిల్యూర్ గురించి నేను ఆలోచించను. కొన్ని సినిమాలు ఆడతాయి.. మరికొన్ని ఆడవు. మంచి సినిమా చేశామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఇండస్ట్రీలో నా ఏజ్ ఉన్నవాళ్లలో కొందరు ఇప్పటికీ సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను’’ అని అదిత్ అరుణ్ అన్నారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధానపాత్రల్లో నటించారు.
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదిత్ అరుణ్ మాట్లాడుతూ– ‘‘ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుని అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. హారర్ కామెడీ స్టోరీకి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, కామెడీ ఉంటాయే కానీ, ఫిజికల్‌గా అసభ్యకరంగా ఉండదు. ‘డబ్బుల కోసం ఈ సినిమా చేశావా?’ అని చాలామంది అడుగుతున్నారు. డబ్బు కోసం కాదు.. కథ బాగా నచ్చి చేశా. ప్రస్తుతం ‘డ్యూడ్’ అనే సినిమా చేస్తున్నా. మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment