మాయా మాల్‌లో ఏం జరిగింది?
‘హోరా హోరీ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన దిలీప్ నటిస్తోన్న రెండో చిత్రం ‘మాయా మాల్’. ఇషా హీరోయిన్. సోనియా, దీక్షాపంత్ తదితరులు ముఖ్య తారలుగా గ్రీష్మ ఆర్ట్స్ సమర్పణలో వైష్ణవి మూవీ మేకర్స్ రూపొందిస్తోన్న ఈ చిత్రానికి గోవింద్ లాలం దర్శకుడు. యార్లగడ్డ జీవన్‌కుమార్, కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మాతలు.
‘‘మాయా మాల్‌లో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లవ్ అండ్ హారర్ కామెడీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. గోవింద్ లాలం మంచి కథ-కథనం తయారు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.