isha
-
‘నన్ను క్షమించు బుమ్రా.. నాకు దురుద్దేశం లేదు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ ఇషా గుహా(Isa Guha) క్షమాపణలు చెప్పారు. బుమ్రాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. దక్షిణ ఆసియా సంతతికి చెందిన తాను బుమ్రాను ప్రశంసించే క్రమంలో అలాంటి పదం వాడటం తప్పేనని అంగీకరించారు.బ్రిస్బేన్‌లో మూడో టెస్టుబోర్డర్- గావస్కర్ ట్రోఫీ 204-25లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో టీమిండియా, అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించాయి. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లో శనివారం మూడో టెస్టు మొదలైంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు తొలిరోజు వర్షం వల్ల ఆటంకం కలగగా.. రెండో రోజు పూర్తి ఆట కొనసాగింది. ఓవరాల్‌గా ఆదివారం ఆసీస్ పైచేయి సాధించినప్పటికీ.. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కామెంట్రీ ప్యానెల్లో ఉన్న ఇషా గుహ.. బుమ్రాను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అతడు మెస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్‘‘అతడు MVP కదా! మీరేమంటారు? నా దృష్టిలో అయితే అతడు మెస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్(Most valuable primate)’’ అంటూ సహచర కామెంటేటర్ బ్రెట్ లీతో ఇషా గుహ వ్యాఖ్యానించారు. నిజానికి క్రికెట్ పరిభాషలో అత్యంత విలువైన ఆటగాడు అని ప్రశంసించే సందర్భంలో MVP(Most Valuable Player) అని వాడతారు.కోతుల గురించి చెప్పేటపుడుఅయితే, ఇషా గుహ ఇక్కడ ప్రైమేట్(primate) అనే పదం వాడటంతో వివాదం చెలరేగింది. పాలిచ్చే జంతువులు(క్షీరదాలు).. ఎక్కువగా కోతుల గురించి చెప్పేటపుడు ఈ పదాన్ని వాడతారు. అయితే, బుమ్రాను ఉద్దేశించి ఇషా ఇలా అనడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ‘మంకీ గేట్’ వివాదాన్ని గుర్తుచేస్తూ ఇషాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.నాకు దురుద్దేశం లేదు.. స్పందించిన రవిశాస్త్రిఈ నేపథ్యంలో ఇషా గుహ స్పందిస్తూ.. బుమ్రాకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. తాను ఉపయోగించిన Primate అనే పదానికి మనుషులనే అర్థం కూడా ఉందని.. ఏదేమైనా తాను అలా అని ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు ఎవరినీ కించపరిచాలనే ఉద్దేశం లేదని.. నిజానికి బుమ్రా ఆట అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. తాను భేషరుతుగా క్షమాపణ చెబుతున్నానని ఇషా గుహ లైవ్ కామెంట్రీలో వివరణ ఇచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ‘‘ధైర్యవంతురాలైన మహిళ’’ అంటూ ఇషా గుహను కొనియాడాడు.మంకీ గేట్ వివాదం?2007-08లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సిడ్నీలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ సందర్భంగా భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ను మంకీ అని సంబోధించాడనే ఆరోపణలు వచ్చాయి.ఈ విషయం గురించి నాటి కెప్టెన్ రిక్కీ పాంటింగ్ అంపైర్‌కు ఫిర్యాదు చేయగా.. భజ్జీపై తొలుత మూడు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయితే, సచిన్ టెండుల్కర్ సహా ఇతర ఆటగాళ్లు భజ్జీ.. హిందీలో.. ‘‘మా...కీ’’ అన్నాడని.. మంకీ అనలేదంటూ విచారణలో తెలిపారు. దీంతో విచారణ కమిటీ హర్భజన్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ Isa Guha apologises on TV for calling Jasprit Bumrah a "primate" during commentary yesterday 🇮🇳#AUSvINDpic.twitter.com/DybT7Nmzzg— Digital Hunt 247 (@digitalhunt247) December 16, 2024 -
బిగ్‌బాస్ నటి బ్రేకప్.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి!
బిగ్‌బాస్ బ్యూటీ ఇషా మాల్వియా ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్ సమర్థ్ జురెల్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో ఉండగానే వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోవడం మరో నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రింకూ ధావన్ విమర్శలు చేసింది. ఇషా మాల్వియా మరో ఆరు నెలల్లో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తుందని కామెంట్స్ చేసింది.అయితే రింకూ ధావన్ చేసిన కామెంట్స్‌పై ఇషా మాల్వియా గట్టిగానే రియాక్ట్ అయింది. ముందు నీ జీవితం ఎలా ఉందో చూస్కో అంటూ ఇచ్చిపడేసింది. ఈ టాపిక్ కాస్తా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇషా కామెంట్స్‌పై రింకూ ధావన్ స్పందించింది. మీరు నా వైవాహిక జీవితం, విడాకుల తీరు గురించి మాట్లాడిన తీరు మీ సున్నితత్వాన్ని తెలియజేస్తోందని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ఇషాతో టచ్‌లో కూడా లేనని చెప్పింది.రింకూ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నువ్వు తెలివిగలదానివి అని చెప్పా. అందులో తప్పేం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నేను అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని సొంతంగా హ్యాండిల్ చేయగలరు. నా విడాకుల గురించి మీరు మాట్లాడిన విధానం చూస్తే మీ సున్నితత్వాన్ని తెలియజేసింది. జీవితంలో మీరు నిజంగా ఎదగాలని కోరుకుంటున్నా. అదే జరగకపోతే రాబోయే 8 నెలల్లో ఇలాంటి ప్రకటనలే వస్తాయి. విష్ యూ గుడ్ లక్' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Rinku Dhawan (@rinku.dhawan15) -
తండ్రి బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ!
బాలీవుడ్ భామ, బిగ్‌బాస్ బ్యూటీ ఇషా మాల్వియా సీజన్-17లో మెరిసింది. ఆమె చివరిసారిగా 'పావోన్ కి జుట్టి' అనే ఆల్బమ్ సాంగ్‌లో కనిపించింది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన తండ్రికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆయన పుట్టిన రోజు కావడంతో కారును బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా.. బిగ్‌బాస్- 17లో చివరిసారిగా కనిపించిన ఇషా మాల్వియా ప్రస్తుతం మాజీ బాయ్‌ఫ్రెండ్ సమర్థ్ జురెల్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి విడిపోవడంపై తన తోటి కంటెస్టెంట్, మరో నటి రింకూ ధావన్ విమర్శలు చేసింది. ఇషాను మరో ఆరు నెలల్లో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తుందని అవహేళనగా మాట్లాడింది. తాజాగా రింకూ ధావన్ చేసిన కామెంట్స్‌పై ఇషా మాల్వియా ఘూటుగా స్పందించింది. ముందు నీ లైఫ్ ఎలా ఉందో చూసుకో అంటూ ఇచ్చిపడేసింది. -
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ఎట్సెట్రా.. హీరోలు కారు. నటులు! వీళ్ల గ్లామర్, గ్రామర్ అంతా కూడా వాళ్ల యాక్టింగ్ టాలెంటే! కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్లో వీళ్లిప్పుడు రణ్వీర్ సింగ్‌తో పోటీపడుతున్నారు! క్రెడిట్.. స్టయిలిస్ట్ ఈశా భన్సాలీదే!ఈశా భన్సాలీ పుట్టిపెరిగింది ముంబైలో! డిజైన్ అండ్ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్లాగే ఈశా కూడా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా వ్యవహరించింది. ఆ బాధ్యతల్లో తలమునకలుగా ఉంటూనే ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. ఆమె అభిరుచి, సూక్ష్మ పరిశీలనే ఈశాకు బాలీవుడ్లో ఎంట్రీ కల్పించాయి. సమకాలీన పోకడలకు సంప్రదాయ సోకును అద్దే ఈశా శైలి బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేకతనిచ్చింది.ఆ స్పెషాలిటీయే రాజ్‌కుమార్ రావు ఆమెను సంప్రదించేలా చేసింది.. తనకు స్టయిలిస్ట్‌గా ఉండమని! ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇసుమంత కూడా లేని ఆ నటుడికి స్టయిలిస్ట్‌గా పనిచేయడమంటే సవాలే! ఒకింత రిస్క్ కూడా! తన ఎక్స్పరిమెంట్స్ ఏ కొంచెం అటూ ఇటూ అయినా తన పేరుతో పాటు రాజ్‌కుమార్ రావు ఖ్యాతీ అభాసుపాలవుతుంది. కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే పర్సనాలిటీని మెరుగుపరచడమే కదా అనే తన ఫ్యాషన్ స్టెప్ని గుర్తు తెచ్చుకుంది. ఫాలో అయిపోయింది. ఆమె చేసిన స్టయిలింగ్‌తో రాజ్‌కుమార్ రావు సెల్యులాయిడ్ మీద అపియర్ అయ్యాడు. ఆడియెన్స్ మురిసిపోయారు ఆయన నటనతోపాటు ఆ స్టయిల్‌కీ! రాజ్‌కుమార్ రావు న్యూ లుక్స్ అజయ్ దేవ్గణ్నీ అబ్బురపరచాయి. ఆరా తీస్తే ఈశా భన్సాలీ పేరు వినిపించింది. అంతే కబురు పంపాడు. తనకు పర్సనల్ స్టయిలిస్ట్ అవసరం లేదు కానీ సినిమాల్లో తనకు కాస్ట్యూమ్ డిజైన్ చేసేపెట్టే బాధ్యతను తీసుకోమన్నాడు. రాజ్‌కుమార్ రావును మించిన చాలెంజ్ అది. అజయ్ దేవ్గణ్కున్న హీరో ఇమేజే పెద్ద హర్డల్. అయినా అధిగమించింది ఏకంగా ఒక ప్రయోగంతో. ఆ కటౌట్ పర్సనాలిటీకి వైట్ జీన్స్, చెక్స్ బ్లేజర్ కాంబినేషన్ కాస్ట్యూమ్ని డిజైన్ చేసి! ఆ ప్రతిభతో బాలీవుడ్ అటెన్షన్ అంతా ఈశా మీదకు మళ్లింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. వాటిల్లో పీకూ, హిందీ మీడియం చిత్రాలూ ఉన్నాయి.ఈశా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించిన స్టార్స్‌లో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నాడు. పని పట్ల ఆమెకున్న కమిట్మెంట్, ఎక్స్‌పరిమెంట్స్‌కి స్టార్స్‌ని ఆమె కన్విన్స్ చేసే విధానం నచ్చిన ఆయుష్మాన్ ఖురానా.. ఈశాను తనకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఉండమని రిక్వెస్ట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానాకు ఫ్యాషన్ స్పృహ మెండు. ఇది కూడా ఆమెకు చాలెంజే అయింది. అన్నిట్లో ప్రవేశం .. కొన్నిట్లో ప్రావీణ్యం ఉన్న ఆయుష్మాన్లాంటి వాళ్లను మెప్పించడం మహా కష్టం. అయితే ఆ నటుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈశా.. ఆయన వ్యక్తిత్వానికి తగిన స్టయిల్ని జోడించి.. ఆ పర్సన్‌ని మరింత ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి! ఆ కాంబినేషన్ ఆఫ్ జర్నీ ఇంకా కొనసాగుతోంది!‘ఆడవాళ్లకు స్టయిలింగ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ.. ఈజీ! మగవాళ్లకే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్.. రెడ్‌కార్పెట్ కోసం ఫీమేల్ స్టార్స్‌కి స్టయిలింగ్ చేయాలనుకోండి.. గౌను.. దానికి తగ్గ జ్యూలరీ అండ్ షూస్ మీద దృష్టి పెడితే చాలు. అదే మగవాళ్లకైతే.. జాకెట్, టై ఉండాలా.. వద్దా.. ఉంటే మ్యాచింగ్ టై, లేపల్ పిన్, షూస్, సాక్స్, కఫిన్స్.. ఓ మై గాడ్.. ఎన్ననీ! ఆయుష్మాన్ ఖురానాతో ప్రమోషన్స్ అంటే చాలా ఎక్సయిట్మెంట్గా ఉంటుంది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉంటుంది! నా పర్సనల్ స్టయిల్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను మినిమలిజమ్ని ఇష్టపడతాను. నా స్టేట్మెంట్ పీస్ ఒక్కదానితో నా ఎంటైర్ లుక్‌ని ప్రెజెంట్ చేస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎలెక్టిక్ అన్నమాట!’ --ఈశా భన్సాలీ -
బిగ్ బాస్ హౌస్‌లో డేటింగ్.. అప్పుడే బ్రేకప్ చెప్పేసుకున్నారా?
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్‌పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్‌లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్‌బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్‌లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్‌పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు. (ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!) తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్‌కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. -
Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ (ఫొటో గ్యాలరీ)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు: స్టైయిలిష్ లుక్‌లో ఇషా!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రెటీలు దగ్గర నుంచి పలు రంగాల అధినేతలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి మీరీ ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ సోదరి ఇషా తన ప్రత్యేక వస్త్రాలంకరణలో అందర్నీ మిస్మరైజ్ చేసింది. ఈ వివాహ వేడుకల్లో ఇషా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచిని తన తల్లి నీతా అంబానీని ఫాలో అయ్యిందా అన్నంత రేంజ్లో ఉంది ఆమె లుక్. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కార్ల్ లాగర్ ఫెల్డ్ చెందిన బ్లాక్ డ్రెస్‌లో అజంతా శిల్పంలా ఉంది. చేతులకు, డైమండ్ బ్రాస్లెంట్, డైమండ్ ఉంగరాలతో మరింత గ్రాండ్‌గా కనిపించింది. చెవులకు కూడా ఆ డ్రస్‌కి తగ్గ డైమండ్ జూకాలు ధరించింది. ఐషా ధరించిన గౌను ఆ బ్రాండ్ వ్యవస్థాపకుడు లాంగర్ ఫెల్డ్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు డిజైన్ చేసింది. ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ డిజైనర్ . తన క్రియేటివిటీతో ఎన్నో ప్రముఖ డిజైనర్ దుస్తులను పరిచయం చేసి ఫ్యాషన్‌కి అసలైన అర్థం ఇచ్చిన వ్యక్తి అతను. అతని బ్రాండెడ్ దుస్తులకు పలు సినీ సెలబ్రెటీలు, వ్యాపార ప్రముఖులే అభిమానులు. ఈ బ్రాండ్ ధర కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇషా ధరించిన లాగర్ఫెల్డ్ గౌనుపై వెండి ఆకుల రూపంలో బ్లాక్ షీర్ సిల్హౌట్ అందంగా డిజైన్ చేశారు. ఆ డ్రెస్‌కి తగ్గట్టు లైట్ మేకప్, పెదాలకు నేచురల్ లిప్‌స్టిక్‌తో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది ఇషా. చెప్పాలంటే పండు వెన్నెలలో ఉండే జాబిల్లిలా ఆమె స్టన్నింగ్ లుక్ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి.మరీ మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! ఆ విషంయలో కాబోయే భార్య..) -
'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్‌లో..'!
బిగ్ బాస్ రియాలిటీ షో అభిమానులను ఓ రేంజ్లో అలరిస్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్-17 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ వారంలో తాజాగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మనస్వి మామ్‌గాయ్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ వారంలో ఈ వారం నామినేట్ అయినవారిలో సమర్థ్ జురెల్, ఇషా మాల్వియా, అరుణ్ మాశెట్టి, సనా రయీస్ ఖాన్ కూడా ఉన్నారు. మానస్వికే తక్కువ ఓట్లు రావడంతో ఎంట్రీ ఇచ్చిన వారానికే బయటకొచ్చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సల్మాన్ భాయ్ ఏంటి ఇదంతా అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో ఇషా, జురెల్ ఇద్దరూ ఒకే బెడ్‌పై నిద్రిస్తూ కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ కంటెస్టెంట్స్‌పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశాడు. సల్మాన్ భాయ్ ఫ్యామిలీ షో పేరుతో ఈ మసాలా డ్రామా ఏంటి? అని కామెంట్ చేశాడు. మరొకరు రాస్తూ.. ఫ్యామిలీ షో పేరుతో ప్రేక్షకులకు ఇలాంటివీ చూపించడమేంటని మండిపడుతున్నారు. బిగ్ బాస్ షోను అడల్ట్ షోగా మార్చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. హౌస్‌లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో అభిషేక్ అక్కడే ఉన్నారు. -
మనం లాంటి అనుభూతి కలుగుతుంది – సుధీర్ బాబు
‘‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయం చేశాను. ఏయన్నార్ ఫ్యామిలీ నటించిన ‘మనం’ చూసినప్పుడు అరుదైన సినిమాగా ఎలా అనుభూతి చెందారో, ‘మామా మశ్చీంద్ర’ చూశాక అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ సినిమాతో హర్షవర్ధన్ టాప్ డైరెక్టర్ అవుతారు’’ అన్నారు సుధీర్ బాబు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇషా రెబ్బా, మృణాలినీ రవి హీరోయిన్లు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్ బాబు షేర్ చేశారు. ‘‘మనం’ రచయితగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందాను. ఇంతకాలం విరామం తీసుకొని ‘మామా మశ్చీంద్ర’ చేయడానికి కారణం.. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘ఈ చిత్రంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మలుపు, సర్ర్పైజ్ వస్తుంది’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
వినోదం..సందేశం
మల్లిక్ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్ హీరో హీరోయన్లుగా, సుమన్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘దుమారం‘. జీఎల్బీ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాయీ బ్రాహ్మణుల వృత్తి, వారు జీవితంలో పడుతున్న ఇబ్బందులను కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో బార్బర్‌గా చేస్తున్నా. వినోదం, సందేశం అన్నీ ఉన్న చిత్రం అన్నారు. ‘‘హీరో తండ్రి పాత్రను సుమన్ చేస్తున్నారు’’ అన్నారు జీఎల్బీ శ్రీనివాస్. ‘‘తొలి చిత్రంలోనే మాస్ క్యారెక్టర్ దొరకడం హ్యాపీ’’ అన్నారు మల్లిక్. ‘‘ఈ సినిమా కో ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, విలన్ కొడుకు పాత్ర చేస్తున్నా’’ అన్నారు పాండు గౌడ్. -
ఐ హేట్ లవ్
‘‘దేవుడడిగాడంట.. నన్ను చేరడానికి ఏడు జన్మలు నాకు భక్తుల్లా బతుకుతారా...లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా అని. ఏడు జన్మలు నీకు దూరంగా ఉండే కన్నా... మూడు జన్మల రాక్షస బతుకే మిన్న అని దేవతలే కోరుకున్నారట’, ‘ఐ హేట్ లవ్’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది ‘మామా మశ్చీంద్ర’ టీజర్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుçస్కూర్ రామ్మోహన్రావు నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా టీజర్‌ను హీరో మహేశ్‌బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో దుర్గ, డీజే, పరశురామ్ పాత్రలు చేశారు సుధీర్‌బాబు. -
నటి దారుణ హత్య.. పాయింట్ బ్లాంక్‌లో గురిపెట్టి..!
జార్ఖండ్‌కు చెందిన నటి ఇషా అల్యా దారుణ హత్యకు గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఆమెను కొందరు దుండగులు ఆమెను కాల్చి చంపారు. జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఇషా ఆలియాను చైన్ స్నాచర్లు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త ప్రకాష్ కుమార్, మూడేళ్ల కుమార్తెతో కలిసి రాంచీ నుంచి కోల్‌కతాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. నటి భర్త కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలిలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. బాధితురాలిని ఉలుబెరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆలియా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె అసలు పేరు రియా కుమారి అయినప్పటికీ ఇషా అలియా పేరుతోనే ఫేమస్ అయింది. -
నటి హేమ కూతురు ఇషా పుట్టిన రోజు ఫోటోలు
-
ఈషా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు హాజరైన వెంకయ్యనాయుడు
-
డిసెంబర్లో అంబానీ కుమార్తె పెళ్లి
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఈషా, పిరమాల్ గ్రూప్ సంస్థల అధిపతి అజయ్ పిరమాల్ కొడుకు ఆనంద్‌ల వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ముకేశ్, నీతా అంబానీల ఇంట్లో ఈ వేడుకను జరిపించనున్నారు. పెళ్లికి ముందటి వారాంతంలో అంబానీ, పిరమాల్ కుటుంబాలు తమ అతిథులకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విందు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి. -
జియో.. మా అమ్మాయి ఆలోచనే
లండన్: దేశ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఆవిర్భావానికి తన కుమార్తె ఈషానే కారణమని వెల్లడించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. ‘మా అమ్మాయి ఈషా 2011లో యేల్ విశ్వవిద్యాలయంలో (అమెరికా) విద్యార్థినిగా ఉన్నప్పుడు.. ఒకసారి సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చింది. అప్పుడు ఏదో కోర్స్ వర్క్ ఆన్లైన్లో పంపాల్సి వచ్చింది. కానీ ఇంటర్నెట్ వేగం తనకు విసుగు తెప్పించింది. నాన్నా.. మన దగ్గర ఇంటర్నెట్ వేగం చాలా దారుణంగా ఉంది అంటూ ఆ విషయాన్ని నాతో పంచుకుంది. ఈలోగా.. ఆకాశ్ (ఈషా కవల సోదరుడు) గతంలో టెలికం అంటే కేవలం వాయిస్ కాల్స్‌కి మాత్రమే పరిమితమని... ప్రస్తుతం కొత్త ప్రపంచం అంతా డిజిటల్మయమేనని చెప్పుకొచ్చాడు. ఈ సంభాషణే జియో ఆవిర్భావానికి బీజం వేసింది’ అని అంబానీ వివరించారు. ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో ’మార్పు చోదకులు’ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి.. పెట్రోలియం రిఫైనింగ్..మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, 4జీ డిజిటల్ సర్వీసుల విభాగంలో అత్యుత్తమ పనితీరునకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఈ పురస్కారం దక్కింది. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో నిలవాలనే ఆకాంక్ష గల భారత నవతరానికి ఈషా, ఆకాశ్‌లాంటి వారు ప్రతినిధులని ముకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కీలకమని, ఈ విషయంలో భారత్ వెనుకబడి పోకూడదంటూ వారే తనను ఒప్పించారని ఆయన తెలిపారు. మూడేళ్లలోనే భారీ నెట్వర్క్.. మొత్తం భారత టెలికం రంగం దేశవ్యాప్తంగా 2జీ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి పాతికేళ్లు తీసుకోగా.. తాము కేవలం మూడేళ్లలో అత్యాధునిక 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను నిర్మించామని.. ఇది ప్రస్తుతం 5జీ టెక్నాలజీకి కూడా ఉపయోగపడనుందని ముకేశ్ అంబానీ చెప్పారు. అమెరికాలో రేటుతో పోలిస్తే పదో వంతుకే ఇక్కడ ఇంటర్నెట్ అందిస్తున్నామన్నారు. ‘‘గతంలో డేటా వేగం చాలా తక్కువగా ఉండటంతో పాటు రేట్లు భారీగా ఉండటం వల్ల మెజార్టీ జనాభాకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండేది కాదు. కానీ జియో రాకతో ఇదంతా మారిపోయింది. దేశమంతటా ఇపుడు ఇంటర్నెట్ లభ్యత పుష్కలంగా ఉంది. పైగా అత్యంత చౌక రేటుకే లభిస్తోంది’’ అని వివరించారు. కార్యకలాపాలు ప్రారంభించిన 170 రోజుల్లోనే తాము 10 కోట్ల మంది కస్టమర్లను సాధించామన్నారు. ఈ నేపథ్యంలో 1జీ నుంచి 3జీ దాకా అమెరికా, యూరప్, చైనా ఆధిపత్యం కనబరిచినప్పటికీ.. 4జీ విషయంలో మాత్రం తమ భారీ నెట్వర్క్ ఊతంతో 2019లో భారత్ లీడర్‌గా నిలుస్తుందని అంబానీ చెప్పారు. 2016లో కార్యకలాపాలు ప్రారంభించిన జియో.. చౌక ఇంటర్నెట్తో పాటు ఉచిత కాల్స్ అందిస్తూ ప్రస్తుతం దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం కంపెనీగా మారింది. రోజూ 5 లక్షల మంది జియోకి మారుతున్నారు.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్‌ని తాము ప్రవేశపెట్టామని.. దీనితో రోజుకు 3 లక్షల నుంచి 5 లక్షల మంది జియో ఫోన్‌కి మారుతున్నారని అంబానీ చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో మొత్తం యూరప్ జనాభాలో మూడింట రెండొంతుల మందికి సమానమైన భారత జనాభాకి ప్రపంచ స్థాయి డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ ర్యాంకులో ఉన్న భారత్.. కేవలం రెండేళ్ల వ్యవధిలో నంబర్ వన్ స్థాయికి ఎదిగిందని చెప్పారు. భారత చరిత్రలోనే అత్యంత భారీ స్టార్టప్‌గా జియో ఎదిగిందన్నారు. ప్రతిష్టాత్మక డ్రైవర్స్ ఆఫ్ చేంజ్ అవార్డు అందుకున్న దిగ్గజ సంస్థల్లో .. ఆలీబాబా, హెచ్‌బీవో, అమెజాన్, యాపిల్, ఫియట్, ర్యాన్ ఎయిర్ తదితర సంస్థలున్నాయి. -
తెలుగమ్మాయిలు ఏం చెప్పినా హైలైట్ అవ్వదు!
‘‘టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొత్త హీరోయిన్లు వస్తున్నారు. తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా ఆప్షన్స్ ఉండటం లేదు. ఎందుకో నాకు తెలీదు. అయినా తెలుగు అమ్మాయిలు ఏం చెప్పినా హైలెట్ అవ్వదు. అదే ఏ బాలీవుడ్ హీరోయినో ప్రభాస్ పక్కన చేస్తానంటే అది హైలైట్ అయిపోతుంది’’ అన్నారు ఈషా. అశోక్, ఈషా జంటగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్శకుడు’. విజయ్‌కుమార్, థామస్, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా చెప్పిన విశేషాలు.. ‘దర్శకుడు’ సినిమాకి ఆడిషన్స్ జరిగిన వెంటనే నన్నీ సినిమాలోకి తీసుకోలేదు. మూడు నెలల తర్వాత దర్శకుడు హరిప్రసాద్ నుంచి కబురొచ్చింది. తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ను, చిత్రయూనిట్‌ను కలవడం జరిగింది. ఈ సినిమాలో నేను పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకునే నమ్రత అనే అమ్మాయి క్యారెక్టర్లో నటించాను. డైరెక్టర్ కావాలనుకునే హీరోను నమ్రత కలుస్తుంది. వారిద్దరి మధ్య రిలేషన్ ఎలా సాగింది? చివరికి వారి జీవితాలు ఎలా ఎండ్ అయ్యాయి అన్నదే చిత్రకథ. ఛాన్స్ వస్తే డైరెక్టర్ సుకుమార్‌గారి సినిమాలో తప్పకుండా చేస్తాను. ఆయన ఈ సినిమా సెట్స్‌కు రాలేదు. ఒకసారి ఆయన బంధువుల ఫంక్షన్లో నేను కలిశా. అప్పుడు సుకుమార్‌గారు ‘దర్శకుడు’ సినిమా, నా నటన చాలా బాగుందని మెచ్చుకోవడం ఆనందంగా అనిపించింది. నా సినీ జర్నీలో గ్యాప్ అంతగా రాలేదు. ‘అంతకు మందు ఆ తరువాత’ సినిమా తర్వాత ‘బందిపోటు’లో యాక్ట్ చేశాను. వెంటనే ఓ తమిళ సినిమా చేశాను. గత ఏడాది ‘మాయమాల్’, ‘దర్శకుడు’ సినిమాలు స్టారై్టయ్యాయి. ‘అమీ తుమీ’ ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టారై్ట, జూన్‌లో విడుదలైంది. ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడతాను. ఉదాహరణకు ‘ఫిదా’లో భానుమతి (సినిమాలో సాయి పల్లవి పాత్ర పేరిది) క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తా. స్టార్ హీరోలతో అని కాదు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. కానీ, పెద్దగా అవకాశాలు రావడం లేదు. -
కష్టం మరచిపోయాం!
‘‘నా నిర్మాతలు హరికృష్ణ, చందుగారు, జీవన్‌గార్లకు అభినందనలు. ఇంత మంచి సినిమా ఇచ్చిన నిర్మాతలకు మా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎప్పుడూ రుణపడి ఉంటాం. శివేంద్రగారు విజువల్స్ బాగున్నాయి. సాయికార్తీక్‌గారి సంగీతం, ఆర్ఆర్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి’’ అని హీరో దిలీప్ అన్నారు.దిలీప్, ఇషా, దీక్షాపంత్, సోనియా ముఖ్య పాత్రల్లో గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాయా మాల్’. కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలైంది. సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో గోవింద్ లాలం మాట్లాడుతూ– ‘‘మేం పడ్డ కష్టాన్ని ‘మాయామాల్’ మార్నింగ్ షోతో మరచిపోయాం. చాలా చోట్ల హౌస్‌పుల్ కలెక్షన్స్ వస్తుండటంతో హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నైజాంలో థియేటర్స్ సరిగ్గా దొరకలేదు. ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు. -
ముందు తారక్... తర్వాత చరణ్... ఇప్పుడు బన్నీ!
‘‘ఇప్పుడు కొన్ని సినిమాలు వారం, పదిహేను రోజులే ఆడుతున్నాయి. ఎక్కువ స్క్రీన్లలో భారీగా విడుదల చేయడం వల్ల 100, 150 రోజుల వరకూ వెళ్లడం లేదు’’ అన్నారు దర్శకుడు సుకుమార్. అశోక్, ఈషా జంటగా జక్కా హరిప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దర్శకుడు’. దర్శకుడు సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 4న విడుదల కానుంది. సాయి కార్తీక్ స్వరకర్త. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘మా ‘దర్శకుడు’ టీజర్ రిలీజ్ చేసిన తారక్ (ఎన్టీఆర్)గారికి, చరణ్ (రామ్‌చరణ్)గారికి ధన్యవాదాలు. ఈ నెల 29న జరగనున్న ప్రీ–రిలీజ్ పంక్షన్‌కు బన్నీ (అల్లు అర్జున్)ని తీసుకు రావాలనుకుంటున్నాం. ఇలా అందరినీ వాడేసుకుంటున్నాం (నవ్వుతూ). ఆడియోకు మంచి రెస్సాన్స్ వస్తోంది. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘టీజర్ చూసిన తర్వాత ఇది ఎలాంటి సినిమా అని చాలామంది అడిగారు. ఇది గుడ్ లవ్‌స్టోరీ. డైరెక్షన్ మీద ప్యాషన్ ఉన్న ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అన్నదే చిత్రకథ. హీరో అశోక్, ఈషా, పూజిత బాగా నటించారు’’ అన్నారు జక్కా హరిప్రసాద్. ‘‘సుకుమార్ సినిమాలో క్యారెక్టర్ల థింకింగ్, యాట్యిట్యూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలోని క్యారెక్టర్లు కూడా డిఫరెంట్‌గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు నిర్మాతలలో ఒకరైన థామస్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరో అశోక్, హీరోయిన్లు ఈషా, నటి పూజిత, సంగీతదర్శకుడు సాయికార్తీక్‌లతోపాటు చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు. -
దర్శకుడి ప్రేమకథ
అశోక్, ఇషా జంటగా హరిప్రసాద్ జక్క దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ నిర్మించిన చిత్రం ‘దర్శకుడు’. వచ్చే నెల 9న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఓ సినీ దర్శకుడి ప్రేమకథ ఇది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ నెల 22న ఓ స్టార్ హీరో చేతుల మీదగా టీజర్, ఇదే నెలలో పాటలు విడుదల చేస్తాం. ఈ చిత్రానికి సుకుమార్‌తో పాటు బిఎన్సిఎస్పి విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి అడూరి, రవిచంద్ర నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా. -
ప్రేమించే దర్శకుడు
దర్శకుడు ఏం చేస్తాడు? సినిమా తీస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే... వీలైతే అతను తీసే సినిమా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అతనే రాసుకుంటాడు. ఇప్పుడు ‘దర్శకుడు’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ నిర్మాత. ఈ సినిమాలో దర్శకుడు... అదేనండీ హీరో ఏం చేస్తాడని అడిగితే? ప్రేమిస్తాడంటున్నారు. ప్రేమించడంతో పాటు ఇంకేం చేస్తాడని అడిగితే... అది చెప్పడానికి ఇంకా టైముందంటున్నారు. అశోక్, ఈష జంటగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మిస్తున్న ‘దర్శకుడు’ సినిమా టాకీ పార్ట్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌లో మిగతా పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్లనున్నారు. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేశ్ కోలా, సంగీతం: సాయి కార్తీక్. -
అంతా తెలుగుమయం!
సాధారణంగా తెలుగు సినిమా తెర పైన, తెర వెనకా పరభాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. కళాకారులకు భాషాబేధం లేదు కాబట్టి, తెలుగు ప్రేక్షకులు అందర్నీ ఆదరిస్తారు. కానీ, ఓ సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారే పని చేశారంటే కాస్త ఎక్కువ ఆనందిస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ అలాంటి ఆనందాన్ని ఇవ్వ నున్నారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోగా ఆయన దర్శకత్వంలో కేసీ నరసింహారావు నిర్మిస్తున్న సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారిని ఎంపిక చేశారు. సినిమా అంతా తెలుగుమయం. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్యపాత్ర చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఈష, అదితీ మ్యానికల్ లు తెలుగమ్మా యిలే. ఈ నెల 1న ప్రారంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో పూర్తవు తుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ. -
మాయా మాల్లో ఏం జరిగింది?
‘హోరా హోరీ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన దిలీప్ నటిస్తోన్న రెండో చిత్రం ‘మాయా మాల్’. ఇషా హీరోయిన్. సోనియా, దీక్షాపంత్ తదితరులు ముఖ్య తారలుగా గ్రీష్మ ఆర్ట్స్ సమర్పణలో వైష్ణవి మూవీ మేకర్స్ రూపొందిస్తోన్న ఈ చిత్రానికి గోవింద్ లాలం దర్శకుడు. యార్లగడ్డ జీవన్‌కుమార్, కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మాతలు. ‘‘మాయా మాల్లో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లవ్ అండ్ హారర్ కామెడీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. గోవింద్ లాలం మంచి కథ-కథనం తయారు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
వారసులొచ్చారు..
* రిలయన్స్‌లో ముకేశ్ అంబానీ సంతానం అరంగేట్రం * రిలయన్స్ జియోలో డెరైక్టరుగా ఇషా, * రిటైల్ వెంచర్స్‌లో డెరైక్టరుగా ఆకాశ్ న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వారసులు వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. ఆయన సంతానం ఇషా, ఆకాశ్.. రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డెరైక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇషా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు ఆకాశ్ డెరైక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ తెలిపింది. శనివారం ఆయా సంస్థల బోర్డు సమావేశాల్లో ఈ మేరకు ఆమోదముద్ర పడినట్లు వివరించింది. అలాగే, ఆర్ఐఎల్లో ప్రస్తుతం స్వతంత్ర డెరైక్టరుగా ఉన్న అదిల్ జైనుల్‌బాయ్ తాజాగా రిలయన్స్ రిటైల్ బోర్డులో నియమితులైనట్లు పేర్కొంది. ముకేశ్ అంబానీకి మొత్తం ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ (23) కవలలు. ఆఖరువాడైన అనంత్ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 1981లో రిలయన్స్‌లో చేరే నాటికి ముకేశ్ అంబానీ వయస్సు 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఇషా, ఆకాశ్ కూడా దాదాపు అంతే వయస్సులో కంపెనీలో చేరడం విశేషం. సైకాలజీలో ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ చేశారు. కొంత కాలం పాటు అమెరికాలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో కూడా పనిచేశారు. మరోవైపు ఆర్థిక శాస్త్రంలో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆకాశ్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆర్ఐఎల్ టెలికం వెంచర్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశాల్లో అంబానీ కుటుంబం మొత్తం సాధారణంగానే కనిపించినా.. కీలకమైన బిజినెస్ డీల్‌లో ఆకాశ్ తొలిసారిగా 2011లో పాలుపంచుకున్నారు. అప్పట్లో కేజీ-డీ6 బ్లాక్‌లో వాటాలను బీపీకి రిలయన్స్ విక్రయించినప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా ఆయన ప్రముఖంగా కనిపించారు. ఇక, ఇషా 16 సంవత్సరాల వయసులో వెలుగులోకి వచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల వారసుల్లో పిన్న వయస్కులకు సంబంధించి ఫోర్బ్స్ జాబితాలో ఆమె రెండో స్థానంలో నిల్చారు. షేల్ గ్యాస్ వెంచర్లో వాటాలు విక్రయిస్తున్న రిలయన్స్ న్యూయార్క్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. అమెరికాలోని ఈగిల్ ఫోర్డ్ షేల్ ఆయిల్, గ్యాస్ వెంచర్లో తమకున్న 45% వాటాలను విక్రయించాలని యోచిస్తోంది. కొనుగోలుదారులను అన్వేషించే బాధ్యతను సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్లకు అప్పజెప్పినట్లు సమాచారం. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్ (ఆర్ఐఎల్) వర్గాలు నిరాకరించాయి. మెకిన్సే లింకు.. ఇటీవల కుటుంబ వ్యాపారాల్లో చేరిన వారసుల్లో చాలా మంది ఏదో ఒక సందర్భంలో మెకిన్సే లేదా మరో కన్సల్టెన్సీలో పని చేసి ఉండటం గమనార్హం. స్వాతి, అజయ్ పిరమాల్ కుమార్తె నందిని పిరమాల్.. సొంత కంపెనీలో చేరడానికి ముందు మెకిన్సేలో బిజినెస్ అనలిస్టుగా చేశారు. తాజాగా ఇషా కూడా మెకిన్సేలో పనిచేశారు. అటు విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ.. కొంతకాలం లండన్‌లోని బెయిన్ అండ్ కో కన్సల్టెన్సీలో చేశారు. రిలయన్స్ సామ్రాజ్యం.. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ అయిన ఆర్ఐఎల్ టర్నోవరు రూ. 4,46,339 కోట్లు కాగా 2013-14లో సంస్థ నికర లాభం రూ. 22,493 కోట్లు. టెలికం సర్వీసుల కోసం ఆర్ఐఎల్ ప్రత్యేకంగా రిలయన్స్ జియోను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ స్పెక్ట్రం దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ సంస్థ ఇదే. త్వరలోనే 4జీ సర్వీసులు ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 148 నగరాల్లో 1,723 స్టోర్స్ ఉన్నాయి. -
సమాజ చైతన్యం కోసం...
మధు, సుధీర్, ఇషా, జయంతి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘పవనిజం’. ఈ.కె. చైతన్య దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కనిష్క పాటలు స్వరపరిచారు. ఈ నెల మూడో వారంలో పాటలను, జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బుధవారం ప్రచార గీతాన్ని యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ -‘‘సామాజిక స్పృహతో పవన్‌కల్యాణ్ మాట్లాడే ప్రతి మాటా యువకులలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆ చైతన్యం నుంచి పుట్టినదే పవనిజం. అభిమానులు కేవలం పవన్ సినిమాలను అభిమానించడం మాత్రమే కాదు.. ఆయన భావాలకు అనుగుణంగా సమాజ సేవ చేయడం అనేదే పవనిజం. పవన్ అభిమానులు తల్చుకుంటే సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చనేది ఈ చిత్రం కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ డోలా, ఎడిటింగ్: సత్య.