జార్ఖండ్‌కు చెందిన నటి ఇషా అల్యా దారుణ హత్యకు గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఆమెను కొందరు దుండగులు ఆమెను కాల్చి చంపారు. జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఇషా ఆలియాను చైన్ స్నాచర్లు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త ప్రకాష్ కుమార్, మూడేళ్ల కుమార్తెతో కలిసి రాంచీ నుంచి కోల్‌కతాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
నటి భర్త కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలిలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. బాధితురాలిని ఉలుబెరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆలియా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె అసలు పేరు రియా కుమారి అయినప్పటికీ ఇషా అలియా పేరుతోనే ఫేమస్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment