కష్టం మరచిపోయాం! | Govind at the Maya Mall SuccessMate has forgotten the difficulty with the Morning Show | Sakshi
Sakshi News home page

కష్టం మరచిపోయాం!

Published Tue, Jul 25 2017 12:07 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

కష్టం మరచిపోయాం! - Sakshi

కష్టం మరచిపోయాం!

‘‘నా నిర్మాతలు హరికృష్ణ, చందుగారు, జీవన్‌గార్లకు అభినందనలు. ఇంత మంచి సినిమా ఇచ్చిన నిర్మాతలకు మా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎప్పుడూ రుణపడి ఉంటాం. శివేంద్రగారు విజువల్స్‌ బాగున్నాయి. సాయికార్తీక్‌గారి సంగీతం, ఆర్‌ఆర్‌ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి’’ అని హీరో దిలీప్‌ అన్నారు.దిలీప్, ఇషా, దీక్షాపంత్, సోనియా ముఖ్య పాత్రల్లో గోవింద్‌ లాలం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాయా మాల్‌’.

కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలైంది. సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో గోవింద్‌ లాలం మాట్లాడుతూ– ‘‘మేం పడ్డ కష్టాన్ని ‘మాయామాల్‌’ మార్నింగ్‌ షోతో మరచిపోయాం. చాలా చోట్ల హౌస్‌పుల్‌ కలెక్షన్స్‌ వస్తుండటంతో హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. నైజాంలో థియేటర్స్‌ సరిగ్గా దొరకలేదు. ఇంత మంచి సక్సెస్‌ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’  అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement