Deekshapanth
-
ఇగోయిస్ట్తో కైరా స్టెప్పులు!
‘ఆకతాయి’ ఫేమ్ ఆశిష్‌రాజ్ హీరోగా సుబ్రమణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇగో’. సిమ్రన్ కథానాయిక. విజయ్ కరణ్, కౌసల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ కైరా దత్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, బాలకృష్ణ ‘పైసా వసూల్’ చిత్రాల్లో కైరా దత్ స్పెషల్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ – ‘‘నా సెకండ్ ఫిల్మ్ ఇది. నా కథను, నన్ను నమ్మి సినిమా తీస్తున్నందుకు నిర్మాతలకు రుణపడి ఉంటాను. టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. మూడు పాటలను గోదావరి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించబోతున్నాం’’ అన్నారు. ‘‘సుబ్రమణ్యం అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అవుట్‌పుట్ బాగా వస్తోంది. ‘ఆకతాయి’ తర్వాత మా సంస్థలో ‘ఇగో’ చిత్రం మంచి హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘పాట చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు కైరాదత్. ‘‘ఈ సంస్థలో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. కథకు తగినట్లుగానే ‘ఇగో’ అనే టైటిల్ పెట్టాం. హీరోగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఆశిష్‌రాజ్. ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో నా పాత్ర నిడివి తక్కువైనా నటనకు ప్రాధాన్యముంది’’ అన్నారు దీక్షాపంత్. -
కష్టం మరచిపోయాం!
‘‘నా నిర్మాతలు హరికృష్ణ, చందుగారు, జీవన్‌గార్లకు అభినందనలు. ఇంత మంచి సినిమా ఇచ్చిన నిర్మాతలకు మా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎప్పుడూ రుణపడి ఉంటాం. శివేంద్రగారు విజువల్స్ బాగున్నాయి. సాయికార్తీక్‌గారి సంగీతం, ఆర్ఆర్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి’’ అని హీరో దిలీప్ అన్నారు.దిలీప్, ఇషా, దీక్షాపంత్, సోనియా ముఖ్య పాత్రల్లో గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాయా మాల్’. కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలైంది. సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో గోవింద్ లాలం మాట్లాడుతూ– ‘‘మేం పడ్డ కష్టాన్ని ‘మాయామాల్’ మార్నింగ్ షోతో మరచిపోయాం. చాలా చోట్ల హౌస్‌పుల్ కలెక్షన్స్ వస్తుండటంతో హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నైజాంలో థియేటర్స్ సరిగ్గా దొరకలేదు. ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు.