ముందు తారక్‌... తర్వాత చరణ్‌... ఇప్పుడు బన్నీ! | special story to darshakudu movie | Sakshi
Sakshi News home page

ముందు తారక్‌... తర్వాత చరణ్‌... ఇప్పుడు బన్నీ!

Published Sun, Jul 23 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

ముందు తారక్‌... తర్వాత చరణ్‌... ఇప్పుడు బన్నీ!

ముందు తారక్‌... తర్వాత చరణ్‌... ఇప్పుడు బన్నీ!

‘‘ఇప్పుడు కొన్ని సినిమాలు వారం, పదిహేను రోజులే ఆడుతున్నాయి. ఎక్కువ స్క్రీన్లలో  భారీగా విడుదల చేయడం వల్ల 100, 150 రోజుల వరకూ వెళ్లడం లేదు’’ అన్నారు దర్శకుడు సుకుమార్‌. అశోక్, ఈషా జంటగా జక్కా హరిప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దర్శకుడు’. దర్శకుడు సుకుమార్‌ సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 4న విడుదల కానుంది. సాయి కార్తీక్‌ స్వరకర్త. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘మా ‘దర్శకుడు’ టీజర్‌ రిలీజ్‌ చేసిన తారక్‌ (ఎన్టీఆర్‌)గారికి, చరణ్‌ (రామ్‌చరణ్‌)గారికి ధన్యవాదాలు.

ఈ  నెల 29న జరగనున్న ప్రీ–రిలీజ్‌ పంక్షన్‌కు బన్నీ (అల్లు అర్జున్‌)ని తీసుకు రావాలనుకుంటున్నాం. ఇలా అందరినీ వాడేసుకుంటున్నాం (నవ్వుతూ). ఆడియోకు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. సినిమా కూడా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘టీజర్‌ చూసిన తర్వాత ఇది ఎలాంటి సినిమా అని చాలామంది అడిగారు. ఇది గుడ్‌ లవ్‌స్టోరీ.  డైరెక్షన్‌ మీద ప్యాషన్‌ ఉన్న ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అన్నదే చిత్రకథ. హీరో అశోక్, ఈషా, పూజిత బాగా నటించారు’’ అన్నారు జక్కా హరిప్రసాద్‌. ‘‘సుకుమార్‌ సినిమాలో క్యారెక్టర్ల థింకింగ్, యాట్యిట్యూడ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది.

అలాగే ఈ సినిమాలోని క్యారెక్టర్లు కూడా డిఫరెంట్‌గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు నిర్మాతలలో ఒకరైన థామస్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరో అశోక్, హీరోయిన్లు ఈషా, నటి పూజిత, సంగీతదర్శకుడు సాయికార్తీక్‌లతోపాటు చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement