అది చెత్త నిర్ణయం | Nayanthara regrets doing Ghajini | Sakshi
Sakshi News home page

అది చెత్త నిర్ణయం

Published Fri, May 10 2019 3:15 AM | Last Updated on Fri, May 10 2019 4:57 AM

Nayanthara regrets doing Ghajini - Sakshi

నయనతార

‘ఎక్స్‌ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి... ట్యూన్‌ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి...’ అంటూ ‘గజిని’ సినిమాలో యూత్‌ని హీటెక్కించారు నయనతార. ఇప్పటికీ ఆ పాట ఎక్కడ విన్నా, చూసినా కాలు కదపకుండా ఉండలేరు. సూర్య హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఆ సినిమాలో చిత్ర పాత్రలో ప్రేక్షకులను అలరించారు నయనతార. ఆ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ సినిమా గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే.. ‘గజిని’ సినిమా చేయడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార పేర్కొన్నారు.

కెరీర్‌ ప్రారంభంలో ఆమె చేసిన తమిళ చిత్రాలు ‘చంద్రముఖి, గజిని’ ప్రేక్ష కుల్లో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ‘గజిని’ చేయడం గురించి ఇటీవల ఆమె మాట్లాడుతూ– ‘‘గజిని’ కథ చెబుతున్నప్పుడు నా పాత్ర వేరు.. తెరపై కనిపించింది వేరు. చిత్ర పాత్రను అంతలా తగ్గించేశారు. ఆ సినిమా చేయాలనుకోవడం నేను తీసుకున్న చెత్త నిర్ణయం. ‘చంద్రముఖి’ సినిమాలో కూడా నాది చిన్న పాత్రే. అయితే ఆ సినిమా మాత్రం నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘గజిని’ తర్వాత పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తపడ్డా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా’తో పాటు తమిళంలో ‘మిస్టర్‌ లోకల్, దళపతి 63, దర్బార్‌’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement