Latest Buzz: Is Allu Arjun Team Up With Muragadass For Ghajini Sequel? - Sakshi
Sakshi News home page

గజినీ సీక్వెల్‌లో అల్లు అర్జున్‌!

Published Tue, May 4 2021 1:55 PM | Last Updated on Tue, May 4 2021 10:15 PM

Muragadass Planning To Sequel Ghajini With Allu arjun - Sakshi

అఅ‍్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీకి కొద్ది రోజుల క్రితం కరోనా సోకడంతో ఈ మూవీ షూటింగ్‌ ఆగిపోయింది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ కొరటాల శ్రీనివాస్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో బన్నీ కూడా ఓ మూవీకి సైన్‌ చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా మురగదాస్‌తో సినిమా చేసేందుకు బన్నీఆసక్తి చూపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గజిని-2 సీక్వెల్‌ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఎప్పటినుంచో గజినీ మూవీ సీక్వెల్‌ తీయాలని భావిస్తున్న మురగదాస్‌కు ఇప్పుడు హీరో దొరికేశాడని, ఇందుకు బన్నీ కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. సూర్య, అసిన్‌ హీరో, హీరోయిన్లుగా 2005లో వచ్చిన ఈ సినిమా హిందీలోనూ రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గజిని సీక్వెల్‌గా మురగదాస్‌ మరో కొత్త కథను రూపొందించనున్నారు. మరి ఈ సీక్వెల్‌ వర్షన్‌లో బన్నీ సరసన హీరోయిన్‌ ఎవరన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు. త్వరలోనే మురగదాస్‌-బన్నీ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చ అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. 

చదవండి : అ‍ల్లు అర్జున్‌ను దారుణంగా అవమానించిన దిల్‌ రాజు!
‘వల్లంకి పిట్ట’ చిన్నారి ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement