తమిళ సినిమా: నటుడు సూర్య దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం గజిని. 2008లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా సూర్య కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుదాస్ అమీర్ ఖాన్ హీరోగా హిందీలోనూ తెరకెక్కించి హిట్ కొట్టారు. ఆ తర్వాత సూర్య, ఏఆర్. మురుగదాస్‌లో కాంబినేషన్లో రూపొందిన ఏళామ్ అరివు చిత్రం 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్!
ఆ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. ఏఆర్ ముగురుదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా తుపాకీ- 2 చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెర్కెక్కించబోతున్నట్టు ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో ఏఆర్.మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈయన చిత్రం చేసి చాలా కాలమే అయ్యింది.
చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
కాగా తాజాగా సూర్యతో మరోసారి సినిమా చేయడానికి ఈయన సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన గజిని చిత్రానికి సీక్వెల్ కోసం మురుగదాస్ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో నటించే విషయమై సూర్యతో సంప్రదింపులు జరుపుతున్న ట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక నటుడు సూర్య చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment