సాక్షి, పూణే: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకచోట ట్రాఫిక్ పోలీసులు కరోనా గురించి రోడ్డు మీద డాన్స్ వేస్తూ అవగాహన కల్పిస్తే మరో చోట చేతులు ఎలా కడుక్కోవాలో ట్రాఫిక్ పోలీసులు చూపించారు. ఇక సోషల్‌మీడియాలో సైతం విభిన్న మీమ్స్‌తో కరోనాపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదేవిధంగా ప్రస్తుతం పూణే పోలీసులు 2008 లో వచ్చిన గజిని ఫోటోతో కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. (కరోనాపై పోరాటం: రంగంలోకి ‘మాయల ఫకీరు’)
1. Wear a mask
— PUNE POLICE (@PuneCityPolice) April 14, 2020
2. Practice social distancing
3. Wash hands frequently
You don’t need to cover your entire body with tattoos for that, do you?#OnGuardAgainstCorona pic.twitter.com/CbJmLB9KoB
గజిని సినిమా మొదటిలో అమీర్‌ఖాన్‌కు షార్ట్‌టర్మ్ మెమరీ ఉండటంతో అన్ని విషయాలను తన ఒట్టిన మీద టాటులా వేసుకుంటాడు. ఇప్పుడు పూణే పోలీసుల ఆ టాటు ప్లేసులో ఒక స్టికర్‌లాంటిది వేసి అన్ని మర్చిపోండి, కానీ మాస్క్ పెట్టుకోవడం మార్చిపోవద్దు అని రాశారు. దాంతో పాటు ఆ ఫోటోలో కోపంతో ఉన్న అమీర్‌ఖాన్ ముఖానికి మాస్క్ కట్టి ఉంది. ఈ ఫోటోని పూణే పోలీసులు తమ అఫిషియల్ ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 1. మాస్క్ ధరించండి. 2. సామాజిక దూరం పాటించండి. 3. చేతులు తరచూ కడక్కోండి అనే క్యాప్షన్‌ను పోలీసులు జోడించారు. దీనికి అదనంగా పోలీసులు ఇందుకోసం మీరు మీ శరీరం మీద టాటులు వేయించుకోవల్సిన పనిలేదు, మీరూ వేయించుకుంటారా? అని జోడించారు. పోలీసులు చేసిన ఈ పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు సామాన్యులకు పోలీసువారికి మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మిగిలిన వారు వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. (భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ)
Comments
Please login to add a commentAdd a comment