టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గజిని లాంటి వాడని, ఎప్పుడు అన్నమాటలు అప్పుడే మర్చిపోతారని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి విమర్శించారు.
తుని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గజిని లాంటి వాడని, ఎప్పుడు అన్నమాటలు అప్పుడే మర్చిపోతారని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అనంతరం సీతారామరాజు సెంటర్లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు. చంద్రబాబు ఆఖరి పోరాటం చేస్తున్నారని, ఈ ఎన్నికలు కొన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య అన్నారు. చంద్రబాబు అధికారం చేజిక్కించుకోకపోతే భవిష్యత్ ఉండదన్నారు.