ఈ పాటకు ట్యూన్ తెలుసా? | do you know tune of this song? | Sakshi
Sakshi News home page

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

Published Fri, Jan 17 2014 6:45 AM | Last Updated on Thu, May 24 2018 3:01 PM

ఈ పాటకు ట్యూన్ తెలుసా? - Sakshi

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
 పల్లవి :  అతడు: రావె నా చెలియా రావె నా చెలియా
   రయ్యంటు రావె చెలి
 వారెవ్వా చెలియా వయసైన చెలియా
   ఊరంతా గోల చెయ్యి
 ఆమె: మమతకు నువ్వు ప్రతిబింబం
   తల్లికన్నా గారాబం
 చిననాటి అనురాగం వయసైతే అనుబంధం
 అ: ఏ అవ్వా నా గువ్వా
   నువ్వింకా అందం దోచెయ్యి
 ॥॥
 చరణం : 1
 అ: జీన్స్ పాంటు వేసుకో లిప్ స్టిక్కు పూసుకో
 నిజమైన తలనెరుపే
   డై వేసి మార్చుకో...ఓ... యే...
 ఆ: ఓలమ్మో ఏమి చోద్యం
   నా వయసే సగమాయే
 అ: క్లింటన్ నంబరు చేసిస్తాను గలగలమంటూ
   ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి
 ఆ: నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు
   మిస్ ఓల్డని చెప్పేయి
 ॥
 చరణం : 2
 ఆ: ఓ... కంప్యూటర్ పాటలకు
   పులివేషం నువ్వాడు
 అ: ఎంటీవీ ఛానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు
 టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్యి బామ్మా
 డిస్నీలాండులో కళ్లాపి జల్లి బియ్యపు పిండితో
   ముగ్గులు వేద్దాం రాబామ్మా
 రోడ్డు మధ్యలో కొట్టేపెట్టి
   గారెలు వేసి అమ్ముదామా ॥
 చిత్రం : జీన్స్ (1998)
 రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్
 సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
 గానం : సోను నిగమ్, హరిణి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement