ఐపీఎల్‌ 2024 ఓపెనింగ్‌ సెర్మనీలో పెర్ఫార్మ్‌ చేయబోయేది వీరే..! | IPL 2024: AR Rahman, Sonu Nigam, Akshay Kumar And Tiger Shroff Will Perform At Opening Ceremony | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2024 ఓపెనింగ్‌ సెర్మనీలో పెర్ఫార్మ్‌ చేయబోయేది వీరే..!

Published Wed, Mar 20 2024 5:25 PM | Last Updated on Wed, Mar 20 2024 6:06 PM

IPL 2024: AR Rahman, Sonu Nigam, Akshay Kumar And Tiger Shroff Will Perform At Opening Ceremony - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్‌) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్‌ ప్రారంభమవుతుంది. 

సీజన్‌ తొలి మ్యాచ్‌ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్‌ సెర్మనీ అరేంంజ్‌ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌, సింగర్‌ సోనూ నిగమ్‌ పెర్ఫార్మ్‌ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్‌ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ జరుగనుంది. 

ఇదిలా ఉంటే, సీఎస్‌కే-ఆర్సీబీ మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డులను  పరిశీలిస్తే..  ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన సూపర్‌ కింగ్స్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

చెపాక్‌ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్‌కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది.


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement