ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సందర్భంగా పతిరణ గాయపడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ ఇవ్వలేదు.
పతిరణ త్వరలోనే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తుంది. సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్‌కేకు ఇది రెండో ఎదురుదెబ్బ. కొద్ది రోజుల ముందు ఈ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా గాయం కారణంగా లీగ్‌కు (మే వరకు) దూరమయ్యాడు. సీఎస్‌కే యాజమాన్యానికి కాన్వే స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సమస్య కానప్పటికీ.. పతిరణ స్థానాన్ని భర్తీ చేయడమే పెద్ద తలనొప్పిగా మారింది.
కాన్వే స్థానంలో అతని దేశానికే చెందిన రచిన్ రవీంద్ర ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారు కాగా.. పతిరణ స్థానం కోసం బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నారు. ముస్తాఫిజుర్ కూడా డెత్ ఓవర్స్ స్పెషలిస్టే కావడంతో సీఎస్‌కే యాజమాన్యం ఇతని వైపే మొగ్గు చూపవచ్చు.
సీఎస్‌కే తొలి మ్యాచ్‌కు వేదిక అయిన చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో మొయిన్ అలీ పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ధోని, బౌలింగ్ కోచ్ బ్రావో.. శార్దూల్ ఠాకూర్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
కాగా, ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపు (మార్చి 22) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తుది జట్లు (అంచనా):
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment