IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం | IPL 2024 Opening Ceremony: Akshay Kumar Tiger Shroff Takes Stage Dances | Sakshi
Sakshi News home page

IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం

Published Fri, Mar 22 2024 6:48 PM | Last Updated on Fri, Mar 22 2024 9:04 PM

IPL 2024 Opening Ceremony: Akshay Kumar Tiger Shroff Takes Stage Dances - Sakshi

IPL 2024 Opening Ceremony: ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌, యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. జోష్‌గా స్టెప్పులేస్తూ చెపాక్‌ స్టేడియాన్ని హోరెత్తించారు.

అనంతరం సోనూ నిగమ్‌ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ మా తుజే సలాంతో గూప్‌బంప్స్‌ తెప్పించాడు. 

ఆ తర్వాత మోహిత్‌ చౌహాన్‌ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్‌ బర్సోరే సాంగ్‌తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది.

బీసీసీఐ బాస్‌లు, కెప్టెన్ల ఆగమనం
వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్‌ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు.

ఆ తర్వాత ఢిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐపీఎల్‌-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement