ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ముందడుగు పడింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల కోసం సంకేత భాష మరియు వివరణాత్మక వ్యాఖ్యానాన్ని అందించనున్నారు. చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల సౌకర్యార్దం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఈ తరహా వ్యాఖ్యానం అమల్లోకి రానుంది.
ఈ నూతన ఒరవడిని అమల్లో పెట్టేందుకు ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఇండియా సైనింగ్ హ్యాండ్స్ (ISH) న్యూస్‌తో చేతులు కలిపింది. ఐఎస్‌హెడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఫీడ్‌ను భారతీయ సంకేత భాషను ఉపయోగించి బాల్ టు బాల్ అప్‌డేట్స్ ఇస్తామని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. సంకేత బాష ఫీడ్‌తో పాటు సాధారణ వెర్బల్ స్కోర్ అప్‌డేట్స్ కూడా ఉంటాయని పేర్కొంది. ఈ వెసులుబాటుతో చెవిటి, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానులు గేమ్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment