నవ్వుల్‌ నవ్వుల్‌  | new telugu movie updates | Sakshi
Sakshi News home page

నవ్వుల్‌ నవ్వుల్‌ 

Published Wed, Mar 14 2018 12:54 AM | Last Updated on Wed, Mar 14 2018 12:54 AM

new telugu movie updates - Sakshi

తేజ, హరిణిరెడ్డి జంటగా రూపొందుతోన్న వినోదాత్మక చిత్రం ‘డ్రీమ్‌ బాయ్‌’. రాజేష్‌ కనపర్తి దర్శకత్వంలో సెవన్‌ వండర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రేణుక నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎం.వి. రావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మరో నిర్మాత రాజ్‌ కందుకూరి క్లాప్‌ ఇచ్చారు. రాజేష్‌ కనపర్తి మాట్లాడుతూ– ‘‘ఇదొక థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌. ప్రేమతో నిండిన క్యూట్‌ స్టోరీ. ఆద్యంతం కామెడీతో రూపొందుతోన్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది.

కొత్త, పాత నటీనటులతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు.  ‘‘రాజేష్‌ చెప్పిక కథ నచ్చడంతో ఈ చిత్రం నిర్మిస్తున్నా. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. మాకు, మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు రేణుక. నటులు ధనరాజ్, రాకేష్, సుఖేష్‌ రెడ్డి, లడ్డు, ఆర్ట్‌ డైరెక్టర్‌ వెంకట్‌ సన్నిధి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని, సంగీతం: సుభాష్‌ ఆనంద్, సమర్పణ: మాస్టర్‌ ఎన్‌.టి. రామ్‌ చరణ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement