జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు హరిణి
Published Fri, Sep 9 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం):
రాజమహేంద్రవరంలోని ది ఫ్యూచర్‌కిడ్స్ బాడ్మింటన్ అకాడమీ విద్యార్థి జి.హరిణి కేంద్రీయ విద్యాలయ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని చీఫ్ కోచ్ ఎన్‌వి.భద్రం ఓ ప్రకటనలో తెలిపారు. హరిణి ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్‌లోని కేంద్రీయ విద్యాలయలో తొమ్మిదో lతరగతి చదువుతూ ఫ్యూచర్‌కిడ్స్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఇటీవల హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ ప్రాంతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈనెల 21న ముంబాయిలో జరిగే కేంద్రీయ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. హరిణిని అకాడమీ డైరెక్టర్ వై.రవిబాబు, ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్, చీఫ్ కోచ్ ఎన్‌వి.భద్రం, కేంద్రీయ పాఠశాల పీఈటీ మధుసూదనరెడ్డి అభినందించారు.
Advertisement
Advertisement