![Andre Russell Dance With Avika Gor](/styles/webp/s3/article_images/2024/05/10/russel.jpg.webp?itok=ybDd7RSo)
ప్రపంచ క్రికెట్‌లో ఆండ్రూ రస్సెల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. విధ్వంసకర బ్యాటర్లలో తరచుగా వినిపించే పేర్లలో ఆయన టాప్‌లో ఉంటారు. వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రాణిస్తున్నాడు.
తాజాగా ఆండ్రూ రస్సెల్ సరికొత్త అవతారం ఎత్తాడు. ఏకంగా హిందీ పాటతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. 'లడ్ కీ తూ కమాల్ కీ' అంటూ తన గాత్రంతో మెప్పించాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్‌తో కలసి రస్సెల్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఇందులో వారిద్దరి డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment