ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది! | Black Movie Child Artist Ayesha Kapoor Get Married | Sakshi
Sakshi News home page

Ayesha Kapoor: ప్రియుడిని పెళ్లాడిన నటి.. సినిమాకు దూరంగా ఏం చేస్తుందంటే?

Mar 24 2025 12:08 PM | Updated on Mar 24 2025 1:01 PM

Black Movie Child Artist Ayesha Kapoor Get Married

బ్లాక్‌ సినిమా (Black Movie) గుర్తుందా? అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మూడు జాతీయ అవార్డులు అందుకుంది. 11 ఫిలింఫేర్‌ పురస్కారాలు గెలుచుకుంది. సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో జూనియర్‌ రాణి ముఖర్జీగా ఆయేషా కపూర్‌ (Ayesha Kapur) నటించింది. ఆనాటి బాలనటి ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబయింది. 

పెళ్లి చేసుకున్న నటి
ప్రియుడు ఆడం ఒబెరాయ్‌ను పెళ్లాడింది. ఢిల్లీలో ఈ వివాహం జరిగింది. ఆయేషాలో పింక్‌ లెహంగా ధరించగా ఆడం పేస్టల్‌ కలర్‌ షేర్వాణీని ఎంచుకున్నాడు. ప్రియురాలికి మ్యాచ్‌ అయ్యేలా ఉండేందుకు పింక్‌ తలపాగా ధరించాడు. ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చైల్డ్‌ ఆర్టిస్టుగా..
తమిళనాడులో పెరిగిన ఆయేషా.. బ్లాక్‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు రణ్‌బీర్‌ కపూర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆయన పర్యవేక్షణలోనే ఆమె తన పాత్ర కోసం సన్నద్ధమైంది. బ్లాక్‌ తర్వాత సికిందర్‌ అనే సినిమాలోనూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసింది. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం న్యూట్రిషన్‌ హెల్త్‌ కోచ్‌గా పని చేస్తోంది.

 

చదవండి: రేయ్‌ వార్నరూ.. క్రికెట్‌ ఆడమంటే డ్యాన్స్‌ చేస్తావా?: రాజేంద్రప్రసాద్‌ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement