బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తన నిద్ర గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. నవ్వులు పూయిస్తున్న ప్రోమోను చూసిన అభిమానులు పూర్తి ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘దబాంగ్ 3’ ప్రమోషన్స్‌లో భాగంగా సల్లూ భాయ్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. ఇందులో వ్యాఖ్యాత కపిల్ శర్మ.. సల్మాన్‌ను ‘నీకు మంచంపై వాలగానే పడుకోడానికి ఎంత సమయం పడుతుంద’ని ప్రశ్నిస్తాడు.
దీనికి సల్లూభాయ్.. అసలు మంచం మీదే పడుకుంటే కదా ఎంత సమయం పడుతుందో తెలిసేది అంటూ వెళ్లి అక్కడున్న సోఫాపై తాను ఎలా పడుకుంటాడో చూపిస్తాడు. దీంతో మొదట అందరూ అవాక్కయినా తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు. ‘నేను మంచంపై కాకుండా సోఫాపైనే పడుకుంటాను. ఎందుకంటే నేనిప్పటికీ ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నా కదా’ అని చెప్పడంతో అక్కడున్న వారు ఘొల్లున నవ్వారు. కాగా సల్మాన్‌ఖాన్ చుల్‌బుల్‌పాండే పాత్రలో దబాంగ్ 3 ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment