ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మరో పరువు నష్టం దావా కేసు పడింది. అమృత్ సర్ కోర్టులో పంజాబ్ మంత్రి మజీతియా కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మరో పరువు నష్టం దావా కేసు పడింది. అమృత్ సర్ కోర్టులో పంజాబ్ మంత్రి మజీతియా కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. డ్రగ్స్ సిండికేట్ తో మజితియాకు సంబంధం ఉందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు.
దీంతో ఆయన ఆరోపణలు కొట్టిపారేశారు. తనపై కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని, నలుగురిలో పరువు తీసే చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓసారి అరుణ్ జైట్లీ డీసీసీబీ విషయంలో కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.