న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ.. | Tamil Nadu Man Died After Bitten By Snake At New Year Celebrations | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు

Published Sun, Jan 1 2023 7:09 PM | Last Updated on Sun, Jan 1 2023 7:09 PM

Tamil Nadu Man Died After Bitten By Snake At New Year Celebrations - Sakshi

ఓ వ్యక్తి న్యూ ఇయర్‌ రోజున విషపూరితమైన పాముతో ఆడుకుంటూ చనిపోయాడు. కొత్త ఏడాది వేడుకల సంబరాలతో మత్తులో ఉన్న ఆ వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మణికందన్‌ అనే వ్యక్తి న్యూ ఇయర్‌ వేడుకల సంబరాల్లో ఆడి పాడి తాగుతూ.. ఎంజాయ్‌ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పక్కనే ఉన్న పొదల్లో పాము పాకుతున్నట్లు చూశాడు.

చుట్టుపక్కలవారు పామును పట్టుకోవద్దని అతన్ని హెచ్చరించిన లక్ష్య పెట్టకుండా పట్టుకునేందుకు యత్నించాడు. చివరికీ మణికందన్‌ ఆ పామును పట్టుకుని చుట్టుపక్కల వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఆ పాము అతన్ని కాటు వేసింది. అయినా సరే నూతన సంత్సరం కానుక అంటూ దానిని మరింత ఎత్తుగా పట్టుకుని దానితో ఆటలాడుతున్నాడు.

ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే అతను కుప్పకూలిపోయాడు. దీంతో అతని స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా...అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వైద్యులకు ఏ పాము కాటేసిందో చూపించేందుకు గోనె సంచెలో వెంట తెచ్చుకున్న పామును చూపిస్తుండగా.. అతను స్నేహితుడు సైతం పాము కాటుకు గురైయ్యాడు. ప్రస్తుతం అతను కడలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు చెప్పారు. 

(చదవండి: ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement