కర్ణాటక మంత్రి రాసలీలలు! | Karnataka minister romance | Sakshi
Sakshi News home page

కర్ణాటక మంత్రి రాసలీలలు!

Published Mon, Dec 12 2016 3:44 PM | Last Updated on Thu, Jul 11 2019 5:20 PM

కర్ణాటక మంత్రి రాసలీలలు! - Sakshi

కర్ణాటక మంత్రి రాసలీలలు!

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అధికార కాంగ్రెస్ మరో ‘నీలి వివాదం’లో చిక్కుకుంది. టిప్పు సుల్తాన్ జయంతి రోజున రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి తన్వీర్‌సేఠ్ వేదికపై ఫోన్‌లో నీలిచిత్రాలను చూస్తూ మీడియా కంటపడ్డం తెలిసిందే. తాజాగా అబ్కారీ మంత్రి హెచ్‌వై మేటీ  విధానసౌధలోని తన కార్యాలయంలోనే రాసలీలలు సాగించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. బాగల్‌కోటేకు చెందిన ఓ ఉద్యోగిని బదిలీ విషయమై కొన్నిరోజుల ముందు మేటీ వద్దకు వచ్చింది. మేటీ ఆమెతో తన కార్యాలయంతో పాటు వివిధ చోట్ల పలు దఫాలుగా రాసలీలలు సాగించారని ఆరోపణలొచ్చాయి. ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్‌మేన్ సుభాష్ రహస్యంగా చిత్రీకరించాడు.

అనంతరం ఆ మహిళతో కలసి మంత్రిని బెదిరించారు. రూ.15 కోట్లు ఇవ్వకుంటే వీడియోలను బయటపెడతామనగా, మంత్రి మేటీ రూ.15 లక్షలు ఇస్తానన్నారు. ఇదే సమయంలో ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్ కొన్ని ప్రసార మాధ్యమాలకు రాసలీలల వీడియోలను ఇవ్వడానికి యత్నించారు. దీంతో మంత్రి అనుచరులు ఫోన్‌లో రాజశేఖర్‌ను బెదిరించారు. రాజశేఖర్ బళ్లారిలోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. తానెలాంటి తప్పూ చేయలేదని మేటీ అన్నారు. ‘నా భార్యతో ఉన్నప్పుడు వీడియోలు తీస్తే ఏం చేయాలి?’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement